Friday, April 17, 2026
E-PAPER
Homeకరీంనగర్రాములోరికి పట్టు వస్త్రాలు సమర్పించిన తహసీల్దార్ దంపతులు

రాములోరికి పట్టు వస్త్రాలు సమర్పించిన తహసీల్దార్ దంపతులు

- Advertisement -

నవతెలంగాణ – రాయికల్
మండలంలోని అయోధ్య, మహితాపూర్,రామాజీపేట్, తాట్లవాయి,కిష్టంపేట గ్రామాల్లో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించి భక్తి పరవశంతో భక్తులు పాల్గొన్నారు.ప్రతి ఏటా అయోధ్య గ్రామంలో సీతారాముల కల్యాణోత్సవానికి మండల తహసీల్దార్ అధికారికంగా పట్టు వస్త్రాలు,ముత్యాల తలంబ్రాలు సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.ఈ ఏడాది కూడా తహసీల్దార్ నాగార్జున దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.ఈ ఉత్సవాల్లో ఆయా గ్రామాల ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు,పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.భక్తుల కోసం అన్నదానం,ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -