Thursday, April 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అడవుల సంరక్షణపై అవగాహన

అడవుల సంరక్షణపై అవగాహన

- Advertisement -

తాడిచెర్ల సెక్షన్ అధికారి జి.లక్ష్మన్
నవతెలంగాణ – మల్హర్ రావు

మండల కేంద్రమైన తాడిచెర్ల సెక్షన్ పరిధిలోని శాత్రజ్ పల్లి బిట్ పరిధిలో ఉపాధిహామీ పనులు నిర్వహిస్తున్న కూలీలకు గురువారం తాడిచెర్ల సెక్షన్ అధికారి గొడుగు లక్ష్మన్ అడవుల సంరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అడవులు నరికిన,అటవీ జంతువులకు హాని కలిగించేలా వేటాడిన, కరెంట్ వైర్లు, ఉచ్చులు బిగించిన శాఖాపరమైన చర్యలు, జైలు శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. అలాగే అడవుల్లో ఉండే సహజ సంపదను తరలిస్తే చర్యలుంటాయని పేర్కొన్నారు. కూలీలు, పశువుల కాపర్లు చుట్ట, బీడీ కాల్సి అడవుల్లో నిర్లక్ష్యంగా నిప్పు వేయడం ద్వారా పెద్ద ప్రమాదానికి దారి తీస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధిహామీ సిబ్బంది, కూలీలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -