Thursday, April 16, 2026
E-PAPER
Homeక్రైమ్ఘోర రోడ్డు ప్రమాదం

ఘోర రోడ్డు ప్రమాదం

- Advertisement -

– ముగ్గురు మృతి, పలువురికి గాయాలు
నవతెలంగాణ – అశ్వారావుపేట 

నియోజకవర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట పట్టణంలో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. స్థానిక కెమిలాయిడ్స్ పరిశ్రమ కు చెందిన రోజువారీ కూలీలు అశ్వారావుపేట – జంగారెడ్డిగూడెం రోడ్డులోని నందమూరి నగర్ వద్ద గల గోదాం నుంచి హెర్బెక్స్‌ కు చెందిన జిగురు బస్తాలను ట్రాక్టర్‌ లో తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

అశ్వారావుపేట – సత్తుపల్లి రోడ్డులోని రైతు వేదిక వద్ద,రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నుంచి బియ్యం లోడుతో వస్తున్న లారీ అదుపుతప్పి ముందుగా ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టి, అనంతరం ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ ను ఢీకొట్టింది.ఢీకొన్న ప్రభావంతో ట్రాక్టర్ ఇంజిన్ రెండు ముక్కలై భారీగా పొగలు ఎగసి పడ్డాయి.

ఈ ప్రమాదంలో మోడల్ కాలనీకి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ చిట్టూరి కృష్ణయ్య (చుక్కయ్య, 55), ఊట్లపల్లి గ్రామానికి చెందిన కొవ్వాసి నాగరాజు (40) అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన మడకం సంతోష్ (19) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అలాగే సోయం రమేష్ తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో ఉన్నాడు. మడకం సోమరాజు, ఆటో, డ్రైవర్ గద్దెల వెంకట్రావు తలకు గాయాలతో చికిత్స పొందుతున్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న స్థానిక సీఐ పి. నాగరాజు, ఎస్ఐ లు యయాతి రాజు, అఖిల సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. గాయపడిన వారిని అంబులెన్సు లో కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

మృతుడు కృష్ణయ్య కుమారుడు రంజిత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.కృష్ణయ్య కు ఒక్కడే కుమారుడు ఉండగా, నాగరాజుకు భార్యతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతదేహాలకు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.ఆస్పత్రి వద్ద మృతుల బంధువుల రోదనలు హృదయ విదారకంగా మారాయి.

అదనపు కలెక్టర్ వేణుగోపాల్ కు తృటిలో తప్పిన ప్రమాదం..
ఆటోను లారీ ఢీకొట్టడంతో ఆటో ముందు ఉన్న అదనపు కలెక్టర్ వేణుగోపాల్ కారు కు ఆటో తగిలి కారు వెనుక భాగం స్వల్పంగా కారు దెబ్బతిన్నది. ఆయన అశ్వారావుపేట లో జరిగిన మండల స్థాయి ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో లో నోడల్ అధికారిగా హాజరు కావడానికి వచ్చారు.కార్యక్రమం జరిగే రైతు వేదిక వద్ద రోడ్డు పక్కన నిలిపిన ఈయన కారుకు ఆటో ఢీ కొట్టింది.అదనపు కలెక్టర్ కు తృటిలో ప్రమాదం నుండి బయటపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -