- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కరాచ్నా వద్ద హౌరా-ఢిల్లీ మార్గంలో కల్కా ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలపై పడి ఉన్న మృతదేహాన్ని గమనించి బ్రేకులు వేసింది. దీంతో పక్క లైన్‌లో వస్తున్న పురుషోత్తం ఎక్స్‌ప్రెస్ ఢీకొని నలుగురు ప్రయాణికులు కిందపడి మరణించారు. మృతులలో ఫిరోజాబాద్‌కు చెందిన ఆకాష్ (19), కలకత్తాకు చెందిన అజయ్‌తో పాటు మరో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఉన్నారు.
- Advertisement -


