మండల ఇంఛార్జి ఎంపిడిఓ శ్రీరామూర్తి
నవతెలంగాణ – మల్హర్ రావు
2025-26 సంవత్సరానికి అమలు చేస్తున్న ఎస్సీ యాక్షన్ ప్లాన్లో భాగంగా రెండు పాడి గేదెల పథకం కొరకు దరఖాస్తుల గడువు ఈ నెల 23 వరకు పొదగించినట్లుగా మండల ఇంఛార్జి ఎంపిడిఓ శ్రీరామూర్తి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు స్థాయి లక్ష్యాల ప్రకారం లబ్దిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. కావున అర్హత ఆసక్తి గల సిడ్యూల్డ్ కులాలకు చెందిన అభ్యర్థులు ఈనెల 23 లోపు https:/Agobmms.cgg.gov.in సైట్ నందు దరఖాస్తు చేసుకుని అట్టి దరఖాస్తు ఫారంను మండల కేంద్రమైన తాడిచెర్ల మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో సమర్పించలన్నారు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఇందుకు అవసరమైన పత్రాలు-ఆధార్ కార్డ్,రేషన్ కార్డ్” ఫుడ్ సెక్యూరిటీ కార్డ్కుల ధృవీకరణ పత్రం తెలంగాణ ఏర్పడిన తర్వాత జారీ చేయబడింది.ఆదాయ ధృవీకరణ పత్రం, పట్టాదార్ పాసుపుస్తకం,వికలాంగులైతే సదరమ్ సర్టిఫికేట్ పాస్పోట్ సైజ్ ఫొటోలు సమర్పించాలని తెలిపారు.



