Thursday, April 16, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఏసీబీకి రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడ్డ విద్యుత్‌ శాఖ ఏడీఈ..

ఏసీబీకి రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడ్డ విద్యుత్‌ శాఖ ఏడీఈ..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : రాష్ట్రంలో ప్రతిరోజు అవినీతి అధికారులు ఏసీబీకి పట్టుబడుతున్నారు. తాజాగా నల్గొండ జిల్లా దేవరకొండ ఏడీఈ సిరికొండ సైదులు గురువారం బాధితుడు నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కాడు. గత సంవత్సరం కంబాలపల్లి 33/11 కేవీ సబ్‌స్టేషన్‌పై పిడుగుపడి మరమ్మతులకు గురైంది.

మరమ్మతులకు అయిన రూ.10 లక్షల బిల్లుల కోసం అధికారిని సంప్రదించగా లంచం డిమాండ్‌ చేశాడు. దీంతో బాధితుడు నల్గొండ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకుని, కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -