Thursday, April 16, 2026
E-PAPER
Homeజిల్లాలుచౌటుప్పల్ బస్టాండ్ ఎదుట ఓపెన్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలి

చౌటుప్పల్ బస్టాండ్ ఎదుట ఓపెన్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలి

- Advertisement -
  • సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్

నవతెలంగాణ-చౌటుప్పల్‌రూరల్: చౌటుప్పల్ నేషనల్ హైవే–65 విస్తరణలో భాగంగా బస్టాండ్ ఎదురుగా ఓపెన్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని నిర్మించాలని సిపిఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ డిమాండ్ చేశారు. గురువారం చౌటుప్పల్ పట్టణంలోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలో సిపిఐ(ఎం) పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ కార్యదర్శి గోశిక కరుణాకర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎండి జహంగీర్ మాట్లాడుతూ.. చౌటుప్పల్ హైదరాబాద్‌కు సమీపంలో ఉండటం, సుమారు లక్ష జనాభాతో వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో నేషనల్ హైవే విస్తరణ పనులు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని చేపట్టాలని అన్నారు. ప్రస్తుతం చిన్న కొండూరు రోడ్డు, తంగడపల్లి రోడ్డు వద్ద మాత్రమే ఓపెన్ ఫ్లైఓవర్ బ్రిడ్జులు నిర్మించడం వల్ల బస్టాండ్‌కు వెళ్లే బస్సులు, వాహనాలు, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.

అందువల్ల హైవే అధికారులు, స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించి బస్టాండ్ ఎదుట ఓపెన్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని నిర్మించాలని,తద్వారా వ్యాపారస్తులు, స్థానిక ప్రజలకు సౌకర్యం కల్పించాలని కోరారు.ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా,రాగిరి కిష్టయ్య నాయకులు బండారు నరసింహ, బత్తుల దాసు,ఆకుల ధర్మయ్య,బొడ్డు అంజిరెడ్డి,సప్పిడి శ్రీనివాసరెడ్డి,తూర్పునూరి మల్లేష్ గౌడ్,చికూరి ఈదయ్య, భామండ్లపల్లి స్వామి,సిల్వర్ జంగయ్య, మొగుదాల రాములు తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -