Wednesday, April 15, 2026
E-PAPER
Homeజిల్లాలుతల్లిపాలతో రొమ్ము క్యాన్సర్ నిర్మూలన 

తల్లిపాలతో రొమ్ము క్యాన్సర్ నిర్మూలన 

- Advertisement -

నవతెలంగాణ- ఆలేరు టౌన్ 
జ‌న్మించిన బిడ్డ‌కు పాలు ఇవ్వడంతో మ‌హిళ‌లు రొమ్ము క్యాన్స‌ర్‌ను నిర్మూలించొచ్చున‌ని సిడిపిఓ స్వరాజ్యం అన్నారు. ఆలేరులో బుధవారం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో పోషణ పక్వాడ 9 నుండి 23 కార్యక్రమంలో భాగంగా, సిడిపిఓ స్వరాజ్యం, తహసిల్దార్ వి. ఆంజనేయులు, మండల అభివృద్ధి అధికారి సత్య ఆంజనేయ ప్రసాద్‌తో కలిసి గర్భిణీలకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు.

ముఖ్య అతిదిగా ఆలేరు మున్సిపలి చైర్మన్ బిజన బాలమణి హాజ‌రైయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. బిడ్డ ఎదుగుదలకు త‌లి పాలు ప్రముఖ పాత్ర వహిస్తుందని, గ‌ర్భ‌ణీలు త‌గు ఆహార జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని సూచించారు. 

డెలివరీ తర్వాత శిశువుకు ముర్రుపాలు, ఆరు నెలల వరకు తల్లి పాలు పట్టించాలని తెలియజేశారు. ఆరు నెలల నిండిన వెంటనే అనుబంధ పోషకాహారం అందించాలని, రెండు సంవత్సరాల వరకు తల్లి పాలు శిశువుకు ఇవ్వడం ద్వారా మెరుగైన ఆరోగ్యం సిద్ధిస్తుందని, బిడ్డకి బిడ్డకి ఎడం ఉంటుందని తెలియ‌జేశారు. అంగన్వాడిలో అందిస్తున్న పోషకాహారం బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో తహసిల్దార్ వి.ఆంజనేయులు, ఎంపీడీవో సత్య ఆంజనేయ ప్రసాద్, 2వార్డు కౌన్సిలర్ మరియమ్మ, ఏపీఎం  సత్యనారాయణ, సూపర్వైజర్ ఆండాలు, జ్యోతి, అంగన్వాడి టీచర్స్, గర్భవతులు, వైద్య  సిబ్బంది  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -