– పుట్ట మధుకు కాంగ్రెస్ నేతల హెచ్చరిక
నవతెలంగాణ – కాటారం
మంథని నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడుతున్న పుట్ట మధు తన వైఖరిని వెంటనే మార్చుకోవాలని జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్య, ఎన్ ఆర్ ఇ జీ ఎస్ రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ దండు రమేష్ లు తీవ్రంగా హెచ్చరించారు. చైతన్యవంతులైన మంథని ప్రజలు రాజ్యాంగబద్ధ ఎన్నికల్లో మంత్రి శ్రీధర్ బాబు గారిని భారీ మెజార్టీతో గెలిపించగా, ఆ తీర్పును గౌరవించకుండా అసత్య ఆరోపణలు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
బుధవారం కాటారం మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జయశంకర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్య, ఈజిసి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్ మాట్లాడుతూ… “మహనీయుల మాల విరమణ” పేరుతో ప్రజలను హేళన చేసే విధంగా మాట్లాడటం పూర్తిగా అనుచితం” అని హితవు పలికారు.
మంథని ప్రజలు విద్యావంతులు, మేధావులు, పోరాటయోధులు, చైతన్యవంతులని, ప్రతి ఎన్నికలో స్పష్టమైన తీర్పునిస్తూ ప్రజాస్వామ్య విలువలను నిలబెడుతున్నారని గుర్తుచేశారు. అలాంటి ప్రజలను కించపరిచేలా మాట్లాడటం పుట్ట మధుకు అలవాటైందని విమర్శించారు.
రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న మంత్రి శ్రీధర్ బాబు పై అసత్య ఆరోపణలు చేస్తే సహించబోమని, ఇలాంటి వ్యాఖ్యలు కొనసాగితే ప్రజలే తగిన సమాధానం ఇస్తారని హెచ్చరించారు. ఈ ప్రాంతంలో విద్యాసంస్థలను అభివృద్ధి చేసి, రాజ్యాంగంపై అవగాహన పెంచుతున్న నాయకుడిని విమర్శించడం పుట్ట మధు అవివేకానికి నిదర్శనమని పేర్కొన్నారు.
ఇంకా, గృహాలు, పెన్షన్లు వంటి సంక్షేమ పథకాలు నిరంతర ప్రక్రియలో భాగమని ప్రజలకు వివరించారు. ఈ సమావేశంలో యూత్ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు చీమల సందీప్, కాంగ్రెస్ నాయకులు గడవెన దేవేందర్, కడారి విక్రమ్, కోడి రవి, భూపెల్లి రాజు, దోమల సమ్మయ్య, సత్యం, వినయ్, మధు తదితరులు పాల్గొన్నారు.



