Wednesday, April 15, 2026
E-PAPER
Homeకరీంనగర్తహశీల్దార్ వాహనంపైకి దూసుకెళ్లిన ఇసుక ట్రాక్టర్

తహశీల్దార్ వాహనంపైకి దూసుకెళ్లిన ఇసుక ట్రాక్టర్

- Advertisement -

నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఇసుక రవాణా విపరీతంగా జరుగుతోంది. ఇసుక ట్రాక్టర్లు విచ్చలవిడిగా అడ్డు అదుపు లేకుండా నడిపిస్తున్నారు. బుధవారం ఏకంగా తహసిల్దార్ వాహనంపైకి ఇసుక ట్రాక్టర్ ను ఎక్కించే ప్రయత్నం చేశారు. సిరిసిల్లలోని ఇసుక ట్రాక్టర్లు నడిపించే డ్రైవర్లు అనేకమంది మైనర్లు కావడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు ఉన్నారు. పట్టణంలో అధికంగా జనరద్దీ ఉన్న ప్రాంతాల్లో ఇసుక ట్రాక్టర్లు అతివేగంగా నడిపిస్తున్నారు. ఒక్కో సమయంలో సడెన్ గా బ్రేక్ వేసినప్పటికీ 100 మీటర్ల దూరంలో ఇసుక ట్రాక్టర్ ఆగుతుంది. అప్పటికే జరిగే ప్రమాదం జరుగుతూనే ఉంది. అయినా అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడరు.

బుధవారం సిరిసిల్ల తహసిల్దార్ మహేష్ ఇసుక క్వారీ సమీపంలోకి వెళ్లి ఇసుక ట్రాక్టర్ల యజమానులతో మాట్లాడి తిరిగి వస్తుండగా అతివేగంగా ఇసుక లోడు తో నడిపిస్తున్న ట్రాక్టర్ ను తహసిల్దార్ వాహనం పైకి దూసుకెళ్లాడు. కారు డ్రైవర్ అప్రమత్తమై కారును తప్పించడంతో తహసిల్దార్ కు పెద్ద ప్రమాదం తప్పింది. తహసిల్దార్ కె భద్రత లేనప్పుడు సామాన్యులకు భద్రత ఎక్కడ ఉంటుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.  పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని ఓ పార్టీ రాజకీయ నాయకులు తహసిల్దార్ పై ఒత్తిడి తీసుకు వస్తున్నట్లు సమాచారం.

ట్రాక్టర్లు అతీ వేగంగా పట్టణంలో నడిపిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. తహసిల్దార్ వాహనంపైకి దూసుకెళ్లిన ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ కు డ్రైవింగ్ లైసెన్స్ లేనట్లు తెలుస్తుంది. ఇసుక ట్రాక్టర్లు విచ్చలవిడిగా నడుస్తున్నాయని మైనింగ్ శాఖ అధికారులకు తాసిల్దార్ మహేష్ సమాచారం ఇవ్వగా తనకు ఏం సంబంధం లేదని మైనింగ్ శాఖ అధికారి తహసిల్దార్ తో పేర్కొనడం గమనార్హం. జిల్లా కలెక్టర్ ఈ సంఘటనపై పూర్తి విచారణ జరిపినట్లయితే అనేక విషయాలు బయటపడే అవకాశాలున్నాయి. ఈ ఘటన నుంచి తెరుకున్న తాసిల్దార్ మహేష్ వెంటనే ట్రాక్టర్ను పోలీస్ స్టేషన్కు తరలించి డ్రైవర్ పై ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇసుక ట్రాక్టర్ల పై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారిస్తేనే ఈ ప్రధాన సమస్య అదుపులోకి వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -