నవతెలంగాణ – నవాబు పేట
కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టిన కేంద్రంలో భాగంగా ఈనెల 9 నుంచి 15 వరకు అట్టహాసంగా నవపేట్ మండల పరిధిలోని యన్మన్గండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలోనిర్వహించిన క్రీడలలో భాగంగా పలు క్రీడలలో యువత పోటీల్లో పాల్గొని తమ క్రీడను ప్రదర్శిస్తూ క్రీడా క్రికెట్ స్ఫూర్తిని చాటుకున్నారు.ఈ సందర్భంగా విన్నర్ రన్నర్ లుగా విజేతలుగా క్రికెట్ విభాగంలో తీగలపల్లి గ్రామం నుండి , రనర్స్ గా కాకర్ల పహాడ్, వాలీబాల్ విభాగంలో మరికల్ విజేతగా రన్నర్స్ గా ఇప్పటూర్, కబడ్డీ విభాగంలో విజేతగా కాకర్ల పహాడ్ గ్రామం, రన్నర్స్ గా మరికల్, కోకో రన్నింగ్ విభాగాల నుంచి విజేతలు నిలిచారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు లక్ష్మి నారాయణ మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాల్లోని క్రీడాకారుల నుండి ప్రతి విభాగంలో ప్రతిభ కలిగిన క్రీడాకారులను మన నియోజకవర్గ సాయికి క్రీడాకారులను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్మనగండ్ల సర్పంచ్ రంజిత్ గౌడ్,జిల్లా కౌన్సిల్ నెంబర్ శ్రీనివాసులు మండల ప్రధాన కార్యదర్శి గణేష్ చారీ మండల బిజెపి సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి, బిజెపి నాయకులు వార్డ్ నెంబర్ సుధాకర్ ఇప్పటూరు, వ్యాయామ ఉపాధ్యాయులు వినోద్ కుమార్ బృందం పెద్ద మొత్తంలో క్రీడాభిమానులు ప్రజలు పాల్గొన్నారు.



