- Advertisement -
ఇంటర్‌లో 991 మార్కులు సాధించిన వర్షిని
నవతెలంగాణ – రాయికల్
మండలంలోని అల్లీపూర్ గ్రామానికి చెందిన పాము ప్రసాద్ కూతురు వర్షిని ఇంటర్ ద్వితీయ సంవత్సరం బైపీసీ గ్రూపులో 1000 మార్కులకు గాను 991 మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. ఆమె తాటిపల్లిలోని తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో విద్యనభ్యసించింది. వర్షిని తండ్రి ప్రసాద్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తుండగా.. తల్లి విజయ గృహిణి. సాధారణ కుటుంబానికి చెందిన వర్షిని సాధించిన ఈ విజయంపై గ్రామస్థులు అభినందనలు తెలిపారు.
- Advertisement -



