నవతెలంగాణ – దర్పల్లి
తనకు చిన్న కూతురు గ్రహణం వల్ల మొర్రి ఉందని బెంగతో తల్లి దోడ్డేనుక కీర్తన (25) వివాహిత బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో ఒంటిపై పెట్రోల్ పోసికొని నిప్పంటించుకుంది. ఈ ఘటనలో తల్లితో పాటు ఏడాది వయస్సున్న కూతురు సాన్వి కూడా మృత్తి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని గోవింద్ పల్లి గ్రామనికి చెందిన దొడ్డేనుక ప్రదీప్ కు బడా బీంగల్ గ్రామనికి చెందిన కీర్తనతో గత 5-6 ఏండ్ల క్రితం వివాహం జరిగింది. వీరి వైవాహిక జీవితం గత కొన్నేండ్లుగా అన్యోన్యంగా సాగింది. వీరికి రియన్షి అనే మొదటి కూతురు (4), పుట్టడంతో కుటుంబమంతా సంతోషంగా ఉంది. అయితే ఇంతలో దిలీప్ ఉపాది కొరకు దుబాయి వెళ్ళాడు.
అంతా సజావుగా సాగుతున్న వీరి జీవితంలో రెండవ కూతురు సాన్వి జన్మించింది. రెండవ కూతురు పుట్టుకతో మొర్రితో జన్మించింది. అప్పటి నుండి మృతురాలు తన కూతురు ఇలా పుట్టిందని, ఆమెలో ఆమె కుమిలి పోటు బాధతో ఉండేదని కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. భార్య బాధను అర్థం చేసుకున్న భర్త దుబాయి నుండి స్వదేశానికి వచ్చి ఇంటి పట్టునే ఉంటూ కూతురుకు వైద్య పరీక్షలు చేయించారు. అదేవిధంగా ఆపరేషన్ కూడా చేయించారు. ఈ చికిత్స తరువాత కొద్దిగా నయం అయిందని, భార్యకు సైతం వైద్యం చేయించగా ఆమె ప్రవర్తనలో కూడా మార్పు వచ్చిందని గ్రహించిన భర్త గతేడాది మళ్ళీ దుబాయి వెళ్ళాడు.
ఈమధ్య చిన్న కూతురు సాన్వి మొదటి పుట్టిన రోజున కుటుంభ సభ్యులు ఘంగా నిర్వహించారు కూడా. అయినప్పటికీ మృతురాలు అప్పుడప్పుడు ఇబ్బందిగా ఉంటూ అంతా నావల్లే గ్రహనంతో నాబిడ్డకు మొర్రి వచ్చిందని వాపోయేదని తెలిసింది. ఉన్నట్లుండి బుధవారం సాయంత్ర తన అత్త మామలు పొలం పనులకని వెళ్తుండగా.. తన తమ్ముడు మస్తున్నాడు మామ.. బండి కావాలట పెట్రోల్ తెచ్చి ఇవ్వుమని కోడలు చెప్పడంతో వాస్తవమే అనుకోని మామ పెట్రోల్ తెచ్చి ఇచ్చి, అత్తమామలు ఇద్దరు పొలం పనుల వద్దకు వెళ్లిపోయారని తెలిసింది.
అంతలో ఇంట్లో ఎవ్వరూ లేరని గ్రహించి ఇదే అడునుగా భవించిందేమో మృతురాలు తలుపులు వేసి గడియ పెట్టుకొని ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నది. అదే నిప్పు చిన్న కూతురు సాన్వికి కూడా తగిలి తల్లి కూతుళ్ళు సగబాగం కాలి, పొగలు కేకలు విన్న చుట్టుపక్కల వారు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఇద్దరూ మృత్తి చెందారు. మృతురాలి తల్లి లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వినయ్ తెలిపారు.
విషయం తెలుసుకున్న భర్త దిలీప్ దుబాయి నుండి నేరుగా ఆస్పత్రి చేరుకొని భార్య, కూతురు మృతదేహాలను చూసి బోరున విలపించాడు. రెవెన్యూ ఇన్స్ పెక్టర్ రాజేశ్వర్ పంచనామా నిర్వహించారు. అనంతరం మృతురాలి స్వగ్రామం గోవింద్ పల్లిలో గురువారం అంత్యక్రియలు నిర్వహించారు. మృతులకు చూసేందుకు సమీప బాధువులు ,గ్రామస్తులు సమీప గ్రామాల ప్రజలు భారీగా చేరుకొని కడసారి చూపుతో కన్నీటి పర్వంతమయ్యారు.



