నవతెలంగాణ-హైదరాబాద్: హోర్ముజ్ జలసంధి వద్ద కొనసాగుతున్న నిర్బంధంపై ఇరాన్ తాజాగా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈ నిర్బంధం ఇలాగే కొనసాగితే వేలాది మంది అమెరికా సైనికులను బందీలుగా తీసుకునే అవకాశం ఉందని ఇరాన్ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇరాన్‌పై అమెరికా నౌకాదళ ఆంక్షలు అమలు చేస్తోంది. ఇరాన్ పోర్ట్‌లను దిగ్బంధనం చేస్తోంది ).
ఇరాన్ పోర్టుల నుంచి బయటకు వచ్చే, లోపలకి వెళ్లే నౌకలను అమెరికా సైన్యం అడ్డుకుంటోంది. దీని వల్ల ఇరాన్ సముద్ర వాణిజ్యానికి తీవ్రం ఆటంకం కలుగుతోంది. హోర్ముజ్ జలసంధిలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. నిర్బంధం కొనసాగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. హోర్ముజ్ జలసంధిపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తే తాము ప్రయోగించే తొలి క్షిపణి దాడికే అమెరికా నౌకలు మునిగిపోతాయని వార్నింగ్ ఇచ్చింది .



