Thursday, April 16, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఅమీన్‌పూర్‌లో విషాదం..వైద్యుల నిర్లక్ష్యంపై ఆరోపణలు

అమీన్‌పూర్‌లో విషాదం..వైద్యుల నిర్లక్ష్యంపై ఆరోపణలు

- Advertisement -

నవతెలంగాణ – అమీన్ పూర్: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ బీరంగూడ లోని తిరుమల ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ మృతి చెందిన ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది.వివరాల ప్రకారం, వందనపురి కాలనీకి చెందిన హారిక (28) కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్లింది. పరీక్షలు చేసిన వైద్యులు ఆమెకు తక్షణ శస్త్రచికిత్స అవసరమని సూచించారు. రాత్రి 8 గంటల సమయంలో ఆసుపత్రిలో చేరిన హారికకు, రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆపరేషన్ నిర్వహించారు. అయితే ఆపరేషన్ సమయంలో పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందినట్లు సమాచారం.
ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మృతురాలి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యమే హారిక మరణానికి కారణమని ఆరోపిస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -