Thursday, April 16, 2026
E-PAPER
Homeకరీంనగర్జగిత్యాల జనగర్జనను జయప్రదం చేయాలి

జగిత్యాల జనగర్జనను జయప్రదం చేయాలి

- Advertisement -

– మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ ల పిలుపు
నవతెలంగాణ-రాయికల్: జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈనెల 20న నిర్వహించనున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభ ‘జనగర్జన’ను విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్మన్ కట్కం రవీంధర్, వైస్ చైర్మన్ తురగ సౌజన్య పిలుపునిచ్చారు.గురువారం పట్టణంలోని వర్తక సంఘంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు,మాజీ మంత్రి జీవన్ రెడ్డి అభిమానులతో సమావేశం నిర్వహించి సభ ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… లక్ష మందితో నిర్వహించనున్న ఈ భారీ సభ ద్వారా ఉత్తర తెలంగాణలో పార్టీకి జగిత్యాల నుంచే జైత్రయాత్ర ప్రారంభం కావాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు.రాయికల్ పట్టణంలోని 12 వార్డులకు ఇన్‌చార్జ్‌లను నియమించి జనసమీకరణపై ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.

మాజీ మంత్రి జీవన్ రెడ్డి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరనున్నారని,కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఈ సభ వేదికగా ఎండగట్టనున్నట్లు తెలిపారు.అలాగే కేసీఆర్ సమక్షంలో భారీ స్థాయిలో చేరికలు ఉండనున్నాయని పేర్కొన్నారు.ఈ సమావేశంలో నాయకులు ఎలిగేటి అనిల్,తురగ శ్రీధర్ రెడ్డి,మ్యాకల రమేష్,కొయ్యేడి మహిపాల్,రాకేష్ నాయక్, మారంపల్లి సాయికుమార్,మహేందర్,దాసరి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -