నవతెలంగాణ – మిడ్జిల్
మిడ్జిల్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షులుగా ఎడ్ల శంకర్ ముదిరాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీవో సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏకగ్రీవంగా మండల కమిటీని ఎన్నుకున్నట్లు తెలిపారు. ఉపాధ్యక్షులు మహిన్ షేక్ జహంగర్, బొల్గం నాగరాజు, కోశాధికారులు సువర్ణమ్మ, ప్రదాన కార్యదర్శిలు రాములు, గోదా శ్రీశైలం యాదవ్ కార్యదర్శ సభ్యులు రాజునాయక్, మణి శంకర్ గౌరవ సభ్యులగా
అంజన్ రెడ్డి, మాధురి మల్లేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచులు సుజాత, మంగమ్మ, వెంకట్ రాములు, శిశికళ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ల సంఘం అధ్యక్షులు శంకరు ముదిరాజ్ మాట్లాడుతూ, నాపై నమ్మకం ఉంచి నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు సర్పంచ్ లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సర్పంచ్ల సమస్యల కోసం నిరంతరం పనిచేస్తానని అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పారు. ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేది సర్పంచులేనని అన్నారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సహకారంతో గ్రామాలన్నీ అభివృద్ధి చేసుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశాంత్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి, శంకర్ నాయక్ తదితరులు ఉన్నారు.



