మాజీ ఎంపిపి మలహల్ రావు
నవతెలంగాణ – మల్హర్ రావు
తాడిచెర్ల ఆరోగ్య కేంద్రాన్ని 24 గంటల ఆసుపత్రిగా మార్చేందుకు మండల స్థాయి అధికారులు,ప్రజాప్రతినిధులు గురువారం నిర్వహించిన మండల స్థాయి గ్రామసభలో తీర్మానం చేయాలని మాజీ ఎంపీపీ చింతలపల్లి మలహల్ రావు కోరారు.ఇందుకు ఎంపిడిఓ,స్పెషల్ ఆపిసర్ తీర్మానం చేసి జిల్లా కలెక్టర్ కు పంపిస్తామని నిండు సభలో మాట ఇచ్చారు.
మండలంలో అన్ని గ్రామాల ప్రజలకు, రైతులకు రాత్రిoభవళ్ళు విష జంతువుల కాటుకు,పురుగుల మందు సేవించిన వారికి తదితర అత్యవసర సేవలకు ఇబ్బందులకు గురివుతున్నట్లుగా చెప్పారు. బొగ్గు తవ్వకాలు చేపట్టిన ఏఎమ్మార్ కంపెనీ 24 గంటలు వైద్య సేవలు అందేలా చేస్తామని మాట తప్పారని గుర్తు చేశారు.ప్రభుత్వం,ఉన్నతాధికారులు సహకారంతో తాడిచెర్ల ఆరోగ్య కేంద్రాన్ని 24 గంటల ఆసుపత్రిగా మారుస్తూ,కొయ్యుర్ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.



