నవతెలంగాణ-కుభీర్
మండల పరిధిలోని బెల్గం గ్రామ చెరువు వద్దకు కొందరు వ్యక్తులు పశువులను వెళ్ళనివ్వట్లేదని, నీళ్లు తాగనివ్వకుండా అడ్డుకుంటున్నారని గ్రామస్తులందరూ మూకుమ్మడిగా తహశీల్దార్ శ్రీదేవికి ఫిర్యాదు చేశారు. ఈ సమస్యను ఎంతో ఓపికతో విన్న తహశీల్దార్ వెంటనే చెరువుతో పాటు దాని చుట్టూ ఉన్న రైతుల భూమి ఎంత ఉందో సర్వే చేసి నివేదక తనకు అందజేయాలని సర్వేయర్ గంగాధర్, ఇన్సెపెక్టర్ శ్రీనివాస్, ఏరిగేషన్ ఇన్సెపెక్టర్ విఠల్, జీపీఓ శ్రీనివాస్ లను ఆదేశించారు. ఈ క్రమంలో వారు సోమవారం చెరువును పరిశీలించి, సర్వే చేపట్టారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ.. ఆక్రమణకు గురైన చెరువు, రైతుల భూముల వివరాలు ఉన్నతాధికారులకు అందజేస్తామని, నివేదకలు రాగానే ఈ సమస్యను పరిష్కరించి, రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్తానిక సర్పంచ్ నిస్తూరు గోవర్ధన్, గ్రామస్తులు, రైతులు, తదితరులు ఉన్నారు.
ఆక్రమానికి గురైన చెరువును పరిశీలించిన అధికారులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



