- Advertisement -
కరస్పాండెంట్ జోసెఫ్
నవతెలంగాణ-మిడ్జిల్
ప్రతి విద్యార్థి చదువుతోపాటు క్రీడా రంగాలలో రాణించాలని, సెట్ మేరీ హై స్కూల్ కరస్పాండెంట్ ఎంప్రయిల్ జోసెఫ్ చెప్పారు. జాతీయ క్రీడ దినోత్సవం సందర్భంగా బుధవారం మండల కేంద్రంలోని సెయింట్ మేరీస్ ఉన్నత పాఠశాలలో క్రీడా దినోత్సవం నిర్వహించారు. ఈ క్రీడా దినోత్సవంతో పాటు మేజర్ ధ్యాన్ చంద్ జయంతినీ నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాల వేశారు. పాఠశాల క్రీడలు విద్యార్థులకు మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండడానికి తోడ్పడతాయని ప్రసంగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల, ప్రిన్సిపాల్ డైసన్, డైరెక్టర్లు శీనా జోసెఫ్,మినీ డైసన్ మరియు ఉపాధ్యాయులు లింగం,రవికుమార్, షినిష్, పి ఈ టి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



