Monday, August 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం అధ్యక్షులుగా పాండు నాయక్ 

ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం అధ్యక్షులుగా పాండు నాయక్ 

- Advertisement -

నవతెలంగాణ-నవాబుపేట
మండల పరిధిలోని వివిధ గ్రామాల్లోని ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం అధ్యక్షులుగా ఫీల్డ్ అసిస్టెంట్ పాండు నాయక్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ సంఘం సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా పాండు నాయక్ మాట్లాడుతూ.. ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. సంఘం కార్యదర్శిగా జంగమ్మ, ఉపాధ్యక్షులుగా సువర్ణ, కోశాధికారిగా సత్యం సలహాదారులుగా చెన్నయ్య శంకర్ తదితరులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -