మండల విద్యాధికారి జి.శారద
నవతెలంగాణ – మర్రిగూడ
మండలంలోని నాలుగు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరం నుండి ప్రీ ప్రైమరీ(ఎల్కేజీ,యూకేజీ) విద్య ను ప్రారంభిస్తున్నట్లు మండల విద్యాధికారి జి శారద ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. మండలంలోని 1. ప్రాథమిక పాఠశాల (దామెర భీమనపల్లి), 2.ప్రాథమిక పాఠశాల (కుదాభక్షపల్లి), 3.ప్రాథమిక పాఠశాల (తిరుగండ్లపల్లి) ,4.ప్రాథమిక పాఠశాల (యరగండ్లపల్లి), ఈ పాఠశాలల పరిధిలోని తల్లిదండ్రులు తమ చిన్నారులకు ఎల్కేజీ,యూకేజీ చదువుటకు ప్రవేశాలు కల్పించుకోవాలని కోరారు. గ్రామ ప్రజలు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన విద్యా సదుపాయాలను వినియోగించుకోవాలని కోరారు. అదేవిధంగా 2026-27 విద్యా సంవత్సరంలో మండలంలోని అన్ని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల నమోదు (ఎన్‌రోల్‌మెంట్) పెంపుదలకు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రత్యేక కృషి చేయాలని సూచించారు.
నాలుగు పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ విద్య ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



