Wednesday, July 22, 2026
E-PAPER
Homeతాజా వార్తలురాహుల్‌ అరెస్టు.. ఎన్‌హెచ్‌-65పై బైఠాయింపునకు జగ్గారెడ్డి పిలుపు

రాహుల్‌ అరెస్టు.. ఎన్‌హెచ్‌-65పై బైఠాయింపునకు జగ్గారెడ్డి పిలుపు

- Advertisement -

పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో భారీగా మోహరించిన పోలీసులు
నవతెలంగాణ–సంగారెడ్డి

ఢిల్లీలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ సంగారెడ్డి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జగ్గారెడ్డి జాతీయ రహదారి-65పై బైఠాయించి ఆందోళన చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్‌ శ్రేణులు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో జరిగిన పరిణామాలపై కాంగ్రెస్‌ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. 

జగ్గారెడ్డి పిలుపు నేపథ్యంలో సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు కొనసాగిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -