Friday, July 11, 2025
E-PAPER
Homeజిల్లాలుప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ సహజం.!

ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ సహజం.!

- Advertisement -
  • తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య
    నవతెలంగాణ – మల్హర్ రావు
  • ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ సహజమని తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య అన్నారు. బుధవారం మండల కేంద్రమైన తాడిచెర్ల మండల పరిషత్ కార్యాలయంలో పదవీ విరమణ చేసిన ఎంపిడిఓ శ్యాంసుందర్ కు ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బంది, మండల పరిషత్ సిబ్బంది ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ దంపతులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ పొందేది ఉద్యోగానికి మాత్రమే సేవకు కాదన్నారు. జీవితాంతం పేదలకు సెవలందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య,కాంగ్రెస్ నాయకులు మండల రాహుల్, అడ్వాల మహేష్,శ్రీనివాస్,కుంట సది,ఇందారపు ప్రభాకర్, పంచాయతీ కార్యదర్శులు,ఉపాధిహామీ సిబ్బంది, మండల పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -