నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో ఆదివారం నల్ల పోచమ్మ ఊరదేవత బోనాల పండుగ గ్రామ సర్పంచ్ ఉషా-సంతోష్ మేస్త్రీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. గ్రామ సర్పంచ్ గా ఉన్న ఇంటి నుంచే మొదటి బోనం ఐదేండ్ల పాటు దేవతకు సమర్పించాలనే ఆనవాయితీ ఈ గ్రామంలో ఉంది. ఇందులో భాగంగా సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రీ ఉదయం పూటనే నల్లపోచమ్మకు మొదటి బోనాన్ని సతీసమేతంగా సమర్పించారు. అదేవిధంగా గ్రామస్థులు బోనాలతో ఊరేగింపుగా వచ్చి, దేవతకు నైవేద్యాలు సమర్పించారు. అమ్మవారికి మేకలను బలి ఇచ్చారు. ఊరి ప్రజలంతా చల్లగా ఉండాలని, వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని, అన్నదాతకు ఆటంకాలు కలగొద్దని గ్రామస్తుల తరపున సర్పంచ్ దేవతను వేడుకున్నారు. అంతకుముందు నల్లపోచమ్మ గుడి దగ్గర ప్రజల సౌకర్యార్థం సర్పంచ్ కుర్చీలు, త్రాగునీరు, నీడ కోసం టెంటు ఏర్పాటు చేశారు. బోనాల నిర్వహన ఘనంగా చేసినందుకు గ్రామస్తులు సర్పంచ్ ఉషా-సంతోష్ మేస్త్రీకి ప్రత్యేక కృతజ్క్షతలు తెలిపారు.
నల్లపోచమ్మకు మొదటి బోనం సమర్పించిన సర్పంచ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



