లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘సతీ లీలావతి’. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగమోహన్ నిర్మించారు.
తాతినేని సత్య దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఈనెల 8న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో శనివారం హీరో రామ్ చరణ్ ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ, ‘సత్య, ఉదరు మంచి కథని నా వద్దకు తీసుకు వచ్చారు. సినిమా అద్భుతంగా వచ్చింది. ఈ చిత్రం కోసం నాగ మోహన్ చాలా కష్టపడ్డారు. దేవ్ సొంతంగా డబ్బింగ్ చెప్పారు. మా ట్రైలర్‌ను రిలీజ్ చేసిన మా బావ రామ్ చరణ్‌కి థ్యాంక్స్. ఆయన రిలీజ్ చేయడం వల్ల మా ట్రైలర్‌కి, మా సినిమాకు రీచ్ పెరిగింది’ అని అన్నారు.
‘మీ అందరితో పాటే నేను కూడా ట్రైలర్ చూశాను. నాకు ట్రైలర్ చాలా నచ్చింది. ఈ వ¶వీ, ఇందులో నేను పోషించిన పాత్ర చాలా కొత్తగా, డిఫరెంట్‌గా ఉంటుంది’ అని దేవ్ మోహన్ చెప్పారు. దర్శకుడు తాతినేని సత్య మాట్లాడుతూ, ‘ఈ సినిమా చిత్రీకరణ సమయంలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. ఇది చాలా మంచి సినిమా. అందరూ థియేటర్లలో ఈ సినిమాని చూసి, సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. నాగ మోహన్ మాట్లాడుతూ, ‘మా చిత్రం ఈనెల 8న రాబోతోంది. అందరూ చూసి ఎంజారు చేస్తారని ఆశిస్తున్నాను. మా సినిమా ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని తెలిపారు. నరేశ్ వి.కె, సప్తగిరి, వీటీవీ గణేశ్, మొట్ట రాజేంద్రన్, జాఫర్, జోషి తదితరులు నటించిన ఈచిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్, సినిమాటోగ్రఫీ: బినేంద్ర మీనన్, మాటలు: ఉదరు పొట్టిపాడు, ఆర్ట్: కోసనం విఠల్, ఎడిటర్: సతీష్ సూర్య.
అందర్నీ మెప్పించే ‘సతీ లీలావతి’
- Advertisement -
- Advertisement -



