నవతెలంగాణ ఆత్మకూర్
అత్మకూర్ మున్సిపాలిటీ పరిధిలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ హియరింగ్ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ ఎ. నరేష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా హియరింగ్ కు హాజరైన ఓటర్ల దరఖాస్తులు, ఆధార్, ఇతర గుర్తింపు పత్రాలు, సంబంధిత రికార్డులను కమిషనర్ పరిశీలించారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు నమోదయ్యేలా చూడాలని, ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని బి ఎల్ ఓ లకు వార్డు అధికారులు, కంప్యూటర్ ఆపరేటర్లను ఆదేశించారు ఈ సందర్భంగా .హియరింగ్ కేంద్రాల వివరాలను తెలిపారు
గురువారం పోలింగ్ బూత్ 214, 215 – పాత విశ్వభారతి స్కూల్ దగ్గర కొనసాగుతుందన్నారు, సెప్టెంబర్ 18: పోలింగ్ బూత్ 216, 217 – మేస్త్రీ కమ్యూనిటీ భవనం, సెప్టెంబర్ 19: పోలింగ్ బూత్ 218 – సాయి వాణి ఫంక్షన్ హాల్, బూత్ 219 – అంగన్వాడీ కేంద్రం, 10వ వార్డు, సెప్టెంబర్ 22: ఎస్సీ కమ్యూనిటీ భవనం, 5వ వార్డు వారిగా ఓటర్ల సౌకర్యార్థం వార్డుల వారీగా హియరింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయటం జరిగిందని తెలిపారు. ప్రజలు తమకు కేటాయించిన తేదీన సంబంధిత హియరింగ్ కేంద్రానికి హాజరై, అవసరమైన ఆధార పత్రాలతో అధికారులకు సహకరించాలని కమిషనర్ కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ నాగమణి, కౌన్సిలర్లు దండు శ్రీనివాసులు, అల్లి శంకరమ్మ, జుబేదా బేగం, బి ఎల్ ఓలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజలు తమకు కేటాయించిన తేదీన సంబంధిత హియరింగ్ కేంద్రానికి హాజరై, అవసరమైన ఆధార పత్రాలతో అధికారులకు సహకరించాలని కమిషనర్ కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ నాగమణి, కౌన్సిలర్లు దండు శ్రీనివాసులు, అల్లి శంకరమ్మ, జుబేదా బేగం, బి ఎల్ ఓలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.



