Tuesday, May 26, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలువడదెబ్బతో ఆరుగురు మృతి

వడదెబ్బతో ఆరుగురు మృతి

- Advertisement -


నవతెలంగాణ- విలేకరులు
ఎండలు మండుతూనే ఉన్నాయి. అక్కడక్కడ చిరుజల్లలు పడినా..ఉక్కపోత, వడగాలులు ఠాటేస్తున్నాయి. వడదెబ్బతో సోమవారం పలు జిల్లాల్లో ఆరుగురు మృతిచెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో చలమప్పగూడెం గ్రామానికి చెందిన బండారు నాగమణి(40) ఎండదెబ్బతో అస్వస్థతకు గురైంది. ఆమెను కుటుంబీకులు సత్తుపల్లి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందింది. బూర్గంపాడు మండల పరిధిలోని టేకులచెరువు గ్రామానికి చెందిన దాసరి దుర్గమ్మ(56) ఆదివారం డీ హైడ్రేషన్‌కు గురైంది. కుటుంబసభ్యులు దుర్గమ్మను చికిత్స నిమిత్తం భద్రాచలం తరలించారు. పరిస్థితి విషమించి ఆస్పత్రిలో చనిపోయింది.
వడదెబ్బతో వ్యక్తి మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలంలోని కాసర్ల పహాడ్‌ గ్రామానికి చెందిన పెద్ద బందెల కృష్ణయ్య(49) కూలి పని చేసేవాడు. పది రోజులుగా ఎండలు తీవ్రంగా ఉండటంతో తట్టుకోలేక అస్వస్థతకు గురై మృతిచెందాడు. అదేవిధంగా, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని పోచమ్మవాడ సమీపంలో కొత్త సాయమ్మ(80), చింతల్‌ బస్తీకి చెందిన పూల వ్యాపారి భాగ్యమ్మ(82) వడదెబ్బతో మృతిచెందారు.
మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రానికి చెందిన యాట ఇందయ్య(60) భవన నిర్మాణ కార్మికుడు. రెండ్రోజుల కిందట కూలి పనికి వెళ్లాడు. పనులు చేసే సమయంలో వడదెబ్బ తగిలి స్పృహ కోల్పోయాడు. వెంటనే కుటుంబీకులు జన్నారంలోని ఆస్పత్రికి తరలించగా ప్రథమచికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం జగిత్యాల ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతిచెందాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -