నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని “హనుమాన్ ఉచిత శిక్షణ కేంద్రం” లో శిక్షణ పొందిన ఇద్దరు గ్రామీణ ప్రాంత విద్యార్థులు భారత సైన్యానికి (ఇండియన్ ఆర్మీ) ఎంపికయ్యారు. అడ్డగూడూరు మండలం, డి. రేపాక గ్రామానికి చెందిన ముక్కామల ఎలేందర్ యాదవ్ అదే గ్రామానికి చెందిన బోనుగు విక్రాంత్ రెడ్డి లు కఠోర శ్రమ, క్రమశిక్షణతో ఆర్మీ ఉద్యోగాలు సాధించారని సంస్థ వ్యవస్థాపకులు, శిక్షకులు మాటూరి వినోద్, కోనేటి గోపాల్ సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు దేశ సేవ చేసే భాగ్యం కలగడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. హనుమాన్ ట్రైనింగ్ సెంటర్‌లో అందించిన ఉచిత శారీరక, మానసిక శిక్షణను సద్వినియోగం చేసుకుని ఈ ఇద్దరు యువకులు మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించడం అభినందనీయమన్నారు. సొంత ఊరికి, కన్న తల్లిదండ్రులకు, తమ శిక్షణ కేంద్రానికి మంచి పేరు తెచ్చిన ఈలేందర్ యాదవ్, విక్రాంత్ రెడ్డిలను నిర్వాహకులు ప్రత్యేకంగా అభినందించి, వారి భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రోజుల్లో మరికొంత మంది యువకులను సైన్యంలో చేరేలా ఉచిత శిక్షణ అందిస్తామని వారు పేర్కొన్నారు. వీరి ఎంపిక పట్ల జిల్లా యువజన క్రీడల అధికారి ధనుంజయ్ , అథ్లెటిక్స్ అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు పోతంశెట్టి వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు శుభాకాంక్షలు తెలిపారని హనుమాన్ ట్రైనింగ్ సెంటర్ కోచ్ కోనేటి గోపాల్ తెలియజేశారు.
హనుమాన్ ట్రైనింగ్ సెంటర్ విద్యార్థులు ఇండియన్ ఆర్మీకి ఎంపిక….
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



