- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఈ ఏడాది జులై ఆరంభం నుంచి టారిఫ్‌లను పునరుద్ధరించే ఆలోచనలో ఉన్నట్లు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్‌ల విధానం చట్టవిరుద్ధమని గత ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. తీర్పు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినప్పటికీ తగ్గమని స్కాట్ బెసెంట్ పేర్కొన్నారు. ఇందుకోసం సెక్షన్ 301 ఉపయోగించుకోనున్నట్లు తెలిపారు. ఈ చట్టం కింద విధించే సుంకాలకు ఇప్పటికే న్యాయపరమైన గుర్తింపు ఉందన్నారు.
- Advertisement -



