Wednesday, July 29, 2026
E-PAPER
Homeఆటలుఆ ఇద్దరి కాంట్రాక్టు ముగిసింది!

ఆ ఇద్దరి కాంట్రాక్టు ముగిసింది!

- Advertisement -

బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్‌ సైకియా
ముంబయి
: భారత సహాయక కోచ్‌‌లు ర్యాన్‌ ‌టెన్‌‌డెస్కోటె, టి. దిలీప్‌ కాంట్రాక్టు ముగిసిందని భారత క్రికెట్‌ ‌నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి దేవాజిత్‌ సైకియా తెలిపారు. నెదర్లాండ్స్‌‌కు చెందిన ర్యాన్‌ ‌టెన్‌‌డెస్కోటె భారత మెన్స్‌ ‌జట్టు సహాయక కోచ్‌‌గా కొనసాగిన సంగతి తెలిసిందే. కుటుంబానికి సమయం వెచ్చించేందుకు జాతీయ జట్టుతో కాంట్రాక్టు వదులుకుని.. ప్రాంఛైజీ క్రికెట్‌‌లో చేరేందుకు టెన్‌ ‌డెస్కోటె మొగ్గుచూపిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని జట్టు మేనేజ్‌‌మెంట్‌‌కు ర్యాన్‌ ఇంగ్లాండ్‌ ‌పర్యటనలో వెల్లడించినట్టు సమాచారం. టెన్‌ ‌డెస్కోటె తప్పుకోనుండగా.. ఫీల్డింగ్‌ ‌కోచ్‌ ‌టి. దిలిప్‌‌కు కొనసాగింపు లభిస్తుందనే వార్తలు వచ్చాయి. వీటిపై మంగళవారం దేవాజిత్‌ ‌సైకియా స్పష్టత ఇచ్చారు. ‘భారత మెన్స్‌ ‌జట్టు సహాయక కోచ్‌‌లు ర్యాన్‌ ‌టెన్‌ ‌డెస్కోటె, టి. దిలీప్‌‌ కాంట్రాక్టు ఇంగ్లాండ్‌ ‌పర్యటనతోనే ముగిసింది. జూన్‌ 10‌న టెన్‌ ‌డెస్కోటె కాంట్రాక్టు ముగియగా, జూన్‌ 8న టి. దిలీప్‌ ‌కాంట్రాక్టు ముగిసింది. కాంట్రాక్టు ముగిసిన తర్వాత, రాజీనామా అంగీకరించటం అనే ప్రసక్తి ఉండదు. ఫీల్డింగ్‌ ‌కోచ్‌ ‌కోసం ముగ్గురి పేర్లను పరిశీలిస్తున్నాం. శ్రీలంక పర్యటనకు బయల్దేరేముందు ఫీల్డింగ్‌ ‌కోచ్‌‌ను ఖరారు చేస్తామని’ దేవాజిత్‌ ‌తెలిపారు. ర్యాన్‌ ‌టెన్‌‌డెస్కోటె ఐపీఎల్‌ ‌ప్రాంఛైజీ కోల్‌‌కతా నైట్‌‌రైడర్స్‌‌తో చేరనుండగా.. టి. దిలీప్‌ ‌దేశవాళీ సర్క్యూట్‌‌లో పనిచేసే అవకాశం ఉంది. భారత మాజీ బ్యాటింగ్‌ ‌కోచ్‌ అభిషేక్‌ ‌నాయర్‌ ‌సైతం ప్రస్తుతం కోల్‌‌కతా నైట్‌‌రైడర్స్‌‌తోనే పనిచేస్తున్న సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -