- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్ : మద్నూర్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న విజయ్ కొండ సేవలు అభినందనీయమని కమ్యూనిటీ నేడియేషన్ వాలంటీర్లు అన్నారు. ఇటీవల కరీంనగర్ లో జరిగిన రెండవ జోనల్ సాయి పోలీస్ డ్యూటీ మీట్ లో జిల్లా స్థాయి అధికారులు 11 పథకాలు సాధించారు. అందులో మద్నూర్ ఎస్సై విజయ్ కొండ రెండు వెండి పతకాలు సాధించి, మద్నూర్ మండలానికి పోలీస్ శాఖ విధుల పట్ల గుర్తింపు తేవడం మంచి పరిణామమని అన్నారు. ఈ సందర్భంగా మద్నూర్ కమ్యూనిటీ మీడియేషన్ వాలంటీర్లు సురేష్ ఉడతవార్, మోర్ అశోక్ కుమార్ లు కలిసి ఎస్సైని సన్మానించారు. ఇలాంటి పథకాలు మరెన్నో సాధించి, ఉన్నత స్థాయికి ఎదగాలని ఈ సందర్బంగా వారు ఆకాంక్షించారు.
- Advertisement -