Thursday, April 30, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుకాంగ్రెస్‌ కబంధహస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి

కాంగ్రెస్‌ కబంధహస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి

- Advertisement -

రైతుబంధు ఏమోగానీ… రాహుల్‌బంధు అమలు
మన అనైక్యత వల్లే ఆమన్‌గల్‌ మున్సిపాల్టీని కోల్పోయాం
బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
కాంగ్రెస్‌, బీజేపీ నుంచి పలువురు గులాబీ పార్టీలో చేరిక
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

కాంగ్రెస్‌ కబంధహస్తాల నుంచి తెలంగాణను కాపాడుకోవాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగా ణ భవన్‌లో కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్‌లు బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి కేటీఆర్‌ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తిడితే సీఎం రేవంత్‌రెడ్డికి పైశాచికానందమా అని ప్రశ్నించారు. ప్రజల బాధలను చూసి ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఆయనకు శాడిస్టిక్‌ ప్లెజర్‌ (పైశాచిక ఆనందం) వస్తుందన్న రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల బాధల పట్ల పైశాచిక ఆనందం పొందుతున్నానని బాహాటంగా చెప్పుకుంటున్న రేవంత్‌రెడ్డిని ఏమనాలని ప్రశ్నించారు. రెండున్నరేండ్ల కాంగ్రెస్‌ పాలనలో అన్ని రంగాల్లో మోసపోయిన ప్రజలు, ప్రభుత్వ అరాచకాల వల్ల అన్యాయానికి గురవుతున్న వర్గాలు ప్రభుత్వాన్ని నిందిస్తుంటే రేవంత్‌రెడ్డి సంబురపడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో 140మంది గురుకుల విద్యార్థులు చనిపోయినా సీఎం ఏం పట్టనట్టు ఉన్నారని తెలిపారు. కనీసం కోతలు లేకుండా కరెంట్‌ ఇవ్వలేక పోతున్నందుకు, రైతుల ఖాతాల్లో రైతుబంధు వేయలేకపోతున్నందుకు సిగ్గనిపిస్తుందా? లేదా? అని ప్రశ్నించారు. ధాన్యం రోడ్ల మీద తడిసి రైతులు ఏడుస్తుంటే కనీసం బాధ కూడా అనిపిస్తుందా? లేదా? అని అడిగారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు ఇవ్వకుండా వారి భవిష్యత్తును రేవంత్‌రెడ్డి గందరగోళంలోకి నెడుతున్నారని విమర్శించారు. విద్యార్థులు కాలేజీ చదువులకు దూరమయ్యే పరిస్థితి కాంగ్రెస్‌ పాలనలో నెలకొన్నదని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం గతంలో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన మంచి పథకమని, బీఆర్‌ఎస్‌ కొనసాగించిందని గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోతే కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా, విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులు హైకోర్టుకు వెళ్తే ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోవడంతో, కాలేజీ వాళ్లు తల్లిదండ్రుల దగ్గర వసూలు చేసుకోవాలని తీర్పు ఇచ్చిందని వివరించారు. ఇలాంటి తీర్పు వచ్చిన తర్వాత విద్యార్థుల కాలేజీ చదువులు అంధకారంలో కూరుకుపోయినా ప్రభుత్వానికి సిగ్గనిపించడం లేదన్నారు. రేవంత్‌రెడ్డి వచ్చాక రైతుబంధు పూర్తిగా ఆగిపోయిందనీ, చివరికి రైతన్నలకు j¶రియా బస్తాలు కూడా దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు. పండించిన ధాన్యంతోపాటు ఇతర పంటలను కొనుగోలు చేయకుండా రైతులను కాంగ్రెస్‌ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నదని అన్నారు. రాష్ట్రంలో రైతుబంధు ఏమోగానీ రాహుల్‌బంధు మాత్రం అమలవుతున్నదని ఎద్దేవా చేశారు. పాలవ¶రు బిడ్డ అని చెప్పుకుంటూ కనీసం మహబూబ్‌నగర్‌ జిల్లాకైనా ఒక్క మంచి పని చేశాడా అన్న విషయాన్ని ప్రజలు ఆలోచించాలని కోరారు. రేవంత్‌రెడ్డి ఎన్నికలప్పుడు అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చి వ¶డు నెలల్లో అమలు చేస్తామని చెప్పి, 30 నెలల తర్వాత కూడా వాటిని అమలు చేయడం లేదన్నారు. అలాంటి వ్యక్తిని ఏమనాలని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే జి జైపాల్‌యాదవ్‌, నాయకులు ఉప్పల వెంకటేశ్‌, గోలి శ్రీనివాస్‌రెడ్డి, విజితారెడ్డి, శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -