Monday, September 14, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుతెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మహోన్నతమైనది

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మహోన్నతమైనది

- Advertisement -

ఈ గడ్డపై మతోన్మాదుల ఆటలు సాగవు
దోపిడీ, పీడన, హత్యలు, లైంగికదాడులకు వ్యతిరేకంగా ప్రతిఘటన
గడీల నుంచి దొరలు, భూస్వాముల్ని తరిమికొట్టిన చరిత్ర ప్రజలది
హిందూ, ముస్లింల కొట్లాటగా చిత్రీకరించే కుట్రలు చెల్లవు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మహోన్నతమైనదనీ, దోపిడీ, పీడన, హత్యలు, లైంగికదాడులకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ ప్రతిఘటన పోరాటమని, అలాంటి గడ్డపై మతోన్మాదుల ఆటలు సాగనివ్వబోమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. ఆదివారం గద్వాల జిల్లా కేంద్రంలోని వాల్మీకి కమ్యూనిటీ హాల్లో ‘‘సెప్టెంబర్ 17 వక్రీకరణలు- వాస్తవాలు’’ అంశంపై ఆ పార్టీ కమిటీ సభ్యులు వీవీ.నరసింహ అధ్యక్షతన సెమినార్‌ నిర్వహిం‌ చారు. ఈ కార్యక్రమానికి హాజరైన జాన్‌వెస్లీ మాట్లాడుతూ నిజాం పాలనలో జమీందారులు, భూస్వాములు చేసిన దోపిడీ, పీడన, హత్యలు మహిళలపై జరిగిన లైంగికదాడులకు వ్యతిరేకంగా, భూమి, భుక్తి, విముక్తి కోసం సాయుధ పోరాటం సాగింద న్నారు. తెలంగా ణలో గ్రామీణ ప్రాంతాలలో భూస్వాములు, దొరలు రైతాంగంపై చేసిన ఆకృత్యాలకు వ్యతిరేకంగా ఈ పోరాటం జరిగిందని తెలిపారు. దొడ్డి కొమరయ్య, చిట్యాల ఐలమ్మ, షేక్ బందగి, షోబుల్లాఖాన్‌ వంటి ఎందరో నాయకులు భూస్వాములకు వ్యతిరేకంగా రక్త తర్పణ చేసి పది లక్షల ఎకరాల భూమిని ‌పేదలకు పంపిణీ చేశారని అన్నారు. 4వేల గ్రామాల్లో గ్రామ స్వరాజ్యాన్ని ఏర్పాటు చేసి గడీల నుంచి దొరలు, భూస్వాములను వెళ్లగొట్టి సమసమాజ నిర్మాణంలో ప్రజలు కీలకపాత్ర పోషించారని తెలిపారు. పెండ్లి అయిన మొదటి రోజే ఆడపిల్లను దొర ఇంటికి పంపించే దుర్మార్గమైన ఆకృ త్యాలకు వ్యతిరేకంగానే పోరాటం సాగిం దన్నారు.

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అన్ని వర్గాల ప్రజలు నిజాం అనుసరించిన దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారన్నారు. కానీ మతోన్మాద బీజేపీ మాత్రం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని హిందూ, ముస్లింల కొట్లాట గా చిత్రీకరించి లాభ పడాలని ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. తెలంగాణ ముమ్మాటికి విలీనమే అని, మతోన్మాదుల ఆటలు తెలంగాణ గడ్డపై సాగనివ్వబోమని స్పష్టం చేశారు. సాయుధ రైతాంగ పోరాట అమరుల స్ఫూర్తితో భూమిలేని పేదలందరికీ భూమి పంచేదాక, ఎర్రజెండా నాయకత్వాన ఉద్యమాలు కొనసాగుతాయని తెలిపారు. దోపిడీ, పీడనకు వ్యతిరేకంగా తిరగబడి పోరాడిన చర్రిత తెలంగాణ ప్రజలదన్నారు. పోరాటాల ద్వారానే సమాజం మార్పు చెందుతుం దని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్.శ్రీరామ్ నాయక్, పార్టీ జిల్లా కార్యదర్శి ఏ.వెంకటస్వామి, జిల్లా కమిటీ సభ్యులు రేపల్లె దేవదాసు, జి.రాజు, పరం జ్యోతి, మద్దిలేటి, ఉప్పేర్ నరసింహ, నాయకులు హమాలీ నర్సింహులు, లక్ష్మన్న, విజయ్ కుమార్, వివిధ మండలాల నుంచి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -