Sunday, May 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కార్మిక చట్టాలను రద్దు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు

కార్మిక చట్టాలను రద్దు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు

- Advertisement -

 సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో మేడే జండావిష్కరణ
నవతెలంగాణ-ఆలేరు రూరల్

బీ జే పీ నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 4 లేబర్ కోడ్ ల మూలంగా యాజమాన్యాల ముందు కార్మికవర్గాన్ని బానిసలుగా చేసి శ్రమను దోచుకోవడమే నని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భువనగిరి డివిజన్ కార్యదర్శి ఇక్కిరి సహదేవ్, ఏ ఐ కె ఎం ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బెజాడి కుమార్, ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు పద్మ సుదర్శన్ లు స్పష్టం చేశారు. ఆలేరు మండలం సాయి గూడెం లో సీపీఐ ఎం.ఎల్ న్యూడెమోక్రసీ గ్రామ కమిటీ ఆద్వర్యంలో 140 వ మేడే ను ఘనంగా నిర్వహించారు. చికాగో మృత వీరులకు సంతాపం ప్రకటించి విప్లవ జోహార్లు తెలిపారు. ఈ సందర్భంగా సహదేవ్, కుమార్, సుదర్శన్ మాట్లాడుతూ..1886 లో అమెరికా లోని చికాగో కార్మిక వర్గం ఓటు హక్కు, ఎనిమిది గంటల పని దినం, సౌకర్యాలు, సమానత్వం, సమానత్వం, దోపిడీ, పీడన నిర్మూలన, సమాజ మార్పు కోసం పోరాడారని, అనేక కార్మిక చట్టాలు,హక్కులు సాధించారని అన్నారు.

నేడు దేశ, ప్రపంచ పోరాట చరిత్రలో గుండు సున్నాగా ఉన్న బీ జే పీ కార్మికులు అనేక త్యాగాలు, ప్రాణ త్యాగం చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేస్తే దేశ కార్మిక వర్గం ఊరుకునే ప్రసక్తే లేదని మరింత పట్టుదలతో పోరాడుతుందని అన్నారు.140 వ మేడే సందర్భంగా పార్టీ జెండాను గ్రామ కమిటీ కార్యదర్శి కొమ్మిడి గోపాల్ రెడ్డి ఎగురవేశాడు. ఈ కార్యక్రమంలో అరుణోదయ కళాకారులు శిఖిలం కుమారస్వామి, ఎలగందుల సిద్దులు, ఇక్కిరి శ్రీనివాస్, ఆర్.ఉదయ్, సీపీఐ ఎం.ఎల్ న్యూడెమోక్రసీ జిల్లా డివిజన్, గ్రామ నాయకులు ఆర్.సీత, చిర బోయిన కొమురయ్య, మారుజోడు సిద్దేశ్వర్, తమ్మడి అంజయ్య, డొంకెన శ్రీహరి, తమ్మడి రమేష్, గోవింద్ పరమేష్, కొమ్మిడీ శ్రీకాంత్ రెడ్డి, కుర్రి మార్కండేయ, దార యాదగిరి, కడకంచి సత్యనారాయణ, కడకంచి రమేష్, కొమ్మిడి గాల్ రెడ్డి, మేకల వెంకటేష్, కడకంచి బీరయ్య, బైరి చంద్రయ్య, కొమ్మిడి నర్సింహారెడ్డి, కడకంచి మధు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -