ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్ల మీద శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్ఎస్ కార్తికేయ నిర్మించిన చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన ఈ సినిమాతో శశాంక్ యేలేటి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ మూవీ అక్టోబర్ 2న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు. హీరో ఫహాద్ ఫాజిల్ మాట్లాడుతూ, ‘తెలుగు నుంచి నాకు ఇంత ప్రేమ వస్తుందని, హైదరాబాద్‌లో ఇంత లవ్ దొరకుతుందని అనుకోలేదు. ట్రైలర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. ఫ్యామిలీతో కలిసి చూడండి. అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది. కార్తికేయ, శోభు గొప్ప నిర్మాతలు. సారా వల్ల ఈ సినిమా నాకు ఎంతో ప్రత్యే కంగా మారింది. నాకు ఎమోషనల్‌గా కనెక్ట్ అయింది. మాకు సపోర్ట్ చేసిన బాలయ్యకి, కమల్ కి, మోహన్ లాల్ కి థాంక్స్’ అని అన్నారు. ‘ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. శశాంక్ కథను, స్క్రీన్ ప్లేని చాలా కొత్తగా రాసుకున్నాడు. టీజర్‌తో కొంత కథను రివీల్ చేశారు. ట్రైలర్‌తో మరి కొంత కథను చెప్పే ప్రయత్నం చేశాం. ఫహద్‌ని తెలుగులో ఇంట్రడ్యూస్ చేస్తుండటం ఆనందంగా ఉంది. సారా అద్బుతంగా నటించింది. ఈ పాపతో చాలా సర్ ప్రైజ్‌లు ఉంటాయి. శోభుతో ప్రయాణం ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది’ అని అన్నారు.
ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



