Saturday, June 6, 2026
E-PAPER
Homeజిల్లాలుముగ్గురు చిన్నారులు జ‌ల స‌మాధి

ముగ్గురు చిన్నారులు జ‌ల స‌మాధి

- Advertisement -

నవతెలంగాణ-భీంగల్: సరదాగా ఆడుకునేందుకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు మొరం గుంతలో మునిగి ప్రాణాలు కోల్పోయిన ఘటన నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల పోలీస్ స్టేషన్ పరిధిలో జ‌రిగింది. లింబాద్రి గుట్ట సమీపంలో శుక్రవారం రోజు మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం… లింబాద్రి గుట్ట వద్ద కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న వారి పిల్లలు హరీష్ (10), వర్షిణి (5), దేవరంగుల సురేష్, పద్మ దంపతుల కుమారుడు అరవింద్ (4) మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఇంటి బయట ఆడుకునేందుకు వెళ్లారు. లింబాద్రిగుట్ట వద్దనున్న వడ్డెర కాలనీకి సంబంధించినటువంటి ముగ్గురు పిల్లలు ధ్యరంగుల అరవింద్ S/o సురేష్ వ. 4 సం.లు, కంది వర్షిని D/o మహేష్ వ 5 సం.లు, కంది హరీష్ D/o మహేష్ 10 సం.లు ఈరోజు ఉదయం నుండి ఆడుకుంటూ, పక్కనే ఉన్న బ్రాహ్మణ కుంట వద్ద స్నానానికి వెళ్లారు. ఈత రాకపోవటంతో దానిలో మునిగి చనిపోయినారు.

ఆడుకునేందుకు వెళ్లిన చిన్నారులు ఎంతసేపటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పరిసర ప్రాంతాల్లో వెతికినా పిల్లల ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు చిన్నారుల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో సమీపంలోని కుంట వద్ద పిల్లల దుస్తులు కనిపించడంతో కుటుంబ సభ్యుల్లో కలకలం రేగింది. ఆ కుంటలో మొరం తవ్వకాల కారణంగా ఏర్పడిన గుంతలు లోతుగా ఉండటంతో గాలింపు కష్టంగా మారింది. అరవింద్ తండ్రి సురేశ్ పిల్లలు కనపడటం లేదని సమాచారం ఇవ్వగా, వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది, గజ ఈతగాళ్లను తీసుకుని వెళ్లి వెతకగా ముగ్గురి మృతదేహాలను వెలికితీయడం జరిగింది. ఎస్సై సీహెచ్. తిరుపతి ఆధ్వర్యంలో భీంగల్ నుంచి గజ ఈతగాళ్లను రప్పించారు.

వారు కుంటలో వెతకగా ముగ్గురు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. బిడ్డలు తిరిగి వస్తారని ఎదురుచూసిన కుటుంబ సభ్యులు, వారి మృతదేహాలను చూసి కన్నీరు కార్చారు. కాసేపటి క్రితం వరకు కళ్లముందు తిరిగిన పిల్లలు ఇలా శవాలుగా మారడంతో లింబాద్రి గుట్ట పరిసరాల్లో విషాద ఛాయలు రేగాయి. కుటుంబ సభ్యుల రోదనలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై సీహెచ్. తిరుపతి తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కావున ఎవరు కూడా చెరువుల వద్దకు కుంట వద్ద స్నానానికి ఈత కోసం వెళ్ళకూడదాని ఎస్సై తిరుపతి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -