- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : డీఎస్పీ భీమ్‌రెడ్డి రిమాండ్ రిపోర్టులో ఏసీబీ అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. ఆయన ఇంట్లో లభించిన 2 మెమరీ కార్డుల్లోని వివరాలతో ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ‘‘భీమ్‌రెడ్డి ఆస్తుల విలువ రూ.200 కోట్లకు పైగా ఉంటుంది. అక్రమాస్తులు కూడబెట్టడంతో ఆయన తెలివిగా వ్యవహరించాడు. మొదట తన పేరిట ఆస్తుల కొనుగోలు చేశాడు. తర్వాత వాటిని రద్దు చేసి బినామీల పేరిట మార్చాడు. క్యాన్సిలేషన్ డీడ్ ద్వారా బినామీల పేరిట ఆస్తులను అనుభవిస్తున్నాడు’’ అన్నారు.
- Advertisement -



