Tuesday, September 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు

ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌన్ 
తొమ్మిది రోజులపాటు నిర్వహించే నవరాత్రి ఉత్సవాలు ఆలేరు పట్టణంలో వాడ వాడల వివిధ రూపాలలో ఉత్సవ కమిటీ సభ్యులు నిలిపారు. వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని, ఆలేరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శంకర్ గౌడ్, ఎస్ హెచ్ ఓ లు ఉదయ్ కిరణ్, ఎన్ వినయ్ కుమార్ ముందస్తుగానే తెలపడంతో  పట్టణంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు నిబంధనలను మేరకు ప్రారంభించారు.

మండపాల నిర్వాహకులు పోలీసుల అనుమతితో శాంతియుత వాతావరణంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు. ఉత్సవాల నిర్వహణలో ఎలాంటి ప్రమాదాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విద్యుత్ అధికారులు మండపాల వద్ద ముందస్తు చర్యలు తీసుకున్నారు. నిర్వాహకులు అప్రమత్తతో వినాయక మండపాలను నిర్వాహకులు పోలీసుల సూచనల మేరకు ఏర్పాటు చేసుకున్నారు.

భక్తి శ్రద్ధల నడుమ కృష్ణుని, శివపార్వతుల అలంకరణతో, కుమారస్వామి ఆకృతితో కలిపి, వివిధ రకాల ఆకృతులతో కూడిన వినాయకులను ఏర్పాటు చేసి నవరాత్రి ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -