Saturday, May 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ గ్రామాల్లో హెచ్చరిక బోర్డులను వేయించాలి: ఏఐఎస్ఎఫ్

 గ్రామాల్లో హెచ్చరిక బోర్డులను వేయించాలి: ఏఐఎస్ఎఫ్

- Advertisement -

ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు కి వినతి
 నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : మోత్కూర్ మండలానికి సంబంధించిన గ్రామాలలో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయించాలని కోరుతూ.. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావుకి  అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా కౌన్సిల్ పక్షాన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతికుమార్ మాట్లాడుతూ.. వలిగొండ నుండి తిరుమలగిరి ప్రధాన హైవే రోడ్లో మోత్కూరు మండలానికి సంబంధించిన పలు గ్రామాలు అంటే పాలడుగు దత్తప్పగూడెం అనాజిపురం పాటిమట్ల మెయిన్ రోడ్ లో ట్రాన్స్పోర్ట్,  గూడ్స్ లారీలు, హెవీ వెహికల్స్ రావడం వలన గ్రామాల్లో ఉన్నటువంటి వ్యక్తులు రోడ్డు క్రాస్ చేసే క్రమంలో హైవే రోడ్డు కావడం వలన వచ్చేటువంటి వెహికల్స్ స్పీడ్ లో రావడం జరుగుతుంది.

అటువంటి గ్రామంలో ప్రజలు, గ్రామస్తులు యాక్సిడెంట్లకు గురవుతూ ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది  కావున పాలడుగు దత్తప్పగూడెం, అనాజిపురం, పాటిమట్ల, గ్రామాల్లో హెచ్చరిక బోర్డు నాటి ప్రజలను అప్రమత్తం చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నామని,  మోత్కూర్ నుండి రాయగిరి రోడ్లో రాజన్న గూడెం గ్రామంలో రోడ్డు రిపేర్ ఉన్నందున వచ్చేటువంటి వెహికల్స్ బైక్ పై నుండి కింద పడడం జరుగుతుంది. కావున ఇట్టి విషయాలపై అతి తొందర్లో స్పందించి సంబంధిత అధికారులకు పంపి ప్రజలకు ఇబ్బందులకు గురికాకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు జిట్టా గౌతమ్, కర్ణాకర్, రమేష్, కర్ణాకర్ లు  పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -