Monday, July 27, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఉక్రెయిన్‌ను వదిలిపెట్టబోం: ఇరాన్‌

ఉక్రెయిన్‌ను వదిలిపెట్టబోం: ఇరాన్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : కాస్పియన్ సముద్రంలో తమ వాణిజ్య నౌకపై ఉక్రెయిన్ దాడి చేసిందని, ఈ ఘటనలో ఒక నావికుడు మరణించగా, మరొకరు గాయపడ్డారని ఇరాన్ తెలిపింది. ఈ దాడిపై టెహ్రాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తమ దేశ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఎలాంటి చర్యకైనా వెనకాడబోమని, ఉక్రెయిన్ తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. యుద్ధం విస్తరించకుండా కీవ్‌ను కట్టడి చేయాలని ఐరోపా దేశాలను ఇరాన్ డిమాండ్ చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ ఈ దాడి చోటుచేసుకోవడం గమనార్హం. అమెరికా ఆంక్షల నేపథ్యంలో కాస్పియన్ సముద్ర మార్గం ఇరాన్‌కు అత్యంత కీలకంగా మారింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -