Tuesday, July 14, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంరష్యాపై ఆంక్షల విషయంలోఏం చేద్దాం ?

రష్యాపై ఆంక్షల విషయంలోఏం చేద్దాం ?

- Advertisement -

ఈయూ విదేశాంగ
మంత్రుల సమాలోచనలు

బ్రస్సెల్స్: యూరోపియన్‌ యూనియన్‌ విదేశాంగ మంత్రులు సోమవారం బ్రస్సెల్స్‌లో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. రష్యాపై కొత్తగా ఆంక్షల విధింపు, ఉక్రెయిన్‌ యుద్ధం సహా పలు అంతర్జాతీయ భద్రతా అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. అయితే రష్యాపై విధించబోయే ఆంక్షల విషయంలో ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదని ఈయూ విదేశాంగ విధాన చీఫ్‌ కాజా కల్లాస్‌ తెలిపారు. ఇటీవలి కాలంలో పౌరులపై రష్యా జరిపిన దాడులకు ప్రతిగా ఆంక్షలు విధించాలని యోచిస్తున్నామని చెప్పారు. రష్యా నియంత్రణలో ఉన్న ప్రాంతాలలో ఉపాధ్యాయులు, పాత్రికేయులు, యుద్ధ ఖైదీలు, అపహరణకు గురైన చిన్నారులు సహా ఉక్రెయిన్‌ పౌరులను నిర్బంధిస్తున్న ఘటనలపై కూడా చర్చిస్తున్నా మని అన్నారు. రష్యా చెరలో ఉన్న వారిని విడిపించేం దుకు తీసుకోవాల్సిన చర్యలు కూడా ఈ సమావేశంలో చర్చకు వస్తాయని ఆమె చెప్పారు. నల్ల సముద్ర వ్యూహం, మధ్యప్రాచ్యం వంటి అంశాలపై కూడా చర్చ జరుగు తుందని సమావేశానికి ముందు విలేకరులకు తెలిపారు. ప్రాంతీయ భద్రతపై గల్ఫ్‌ భాగస్వాములతో చర్చిస్తామని, హార్ముజ్‌లో తాజా పరిణామాలను సమీక్షిస్తామని వివరిం చారు. ‘హార్ముజ్‌ జలసంధిని తెరవాల్సి ఉంది. స్వేచ్ఛా యుత నౌకాయానాన్ని గౌరవించాలి. రుసుములు, ఫీజులు వసూలు చేయకూడదు’ అని కాజా కల్లాస్‌ అన్నారు.
ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లోని ఇజ్రాయిల్‌ సెటిల్మెంట్లపై వాణిజ్య ఆంక్షలు విధించాలని కూడా ఈయూ విదేశాంగ మంత్రులు భావిస్తున్నారు. మధ్యప్రాచ్య విధానంపై ప్రధాన నిర్ణయాలు తీసుకోవడంలో ఈయూలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈయూలోని 27 సభ్య దేశాల మధ్య అభిప్రాయబేధాలు నెలకొనడమే దీనికి కారణం. ముఖ్యంగా ఇజ్రాయిల్‌-పాలస్తీనా ఘర్షణలపై ఏకాభిప్రాయం కుదరడం లేదు. అయితే సెటిల్మెంట్లపై చర్యలు తీసుకోవాల్సిందేనని సభ్య దేశాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -