డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న సినిమా ‘రోమాంచకం’. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటించారు. ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రూపొందిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 3న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఏషియన్ సినిమాస్ ద్వారా ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో రిలీజ్ చేస్తున్నారు. బుధవారం ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. హీరోయిన్ అనంతిక సనిల్ కుమార్ మాట్లాడుతూ,‘మా సినిమా చూసి ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ ఏంటో ఫీల్ కావాలంటే సెప్టెంబర్ 3న మా మూవీ చూసేందుకు థియేటర్స్ కు రండి’ అని తెలిపారు. ‘ఓ మంచి సినిమాతో మీ ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది’ అని డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి వంగా మాట్లాడుతూ,‘మా మూవీకి వర్క్ చేసిన యంగ్ టీమ్ కోసం ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా. ఈ సినిమా విజయం మా భద్రకాళీ సంస్థ కంటే వాళ్లకు ఎక్కువ అవసరం’ అని అన్నారు. ‘అందరినీ నవ్వించే, అందరూ ఇష్టపడే అందమైన క్యారెక్టర్ లో నటించే అవకాశం కల్పించిన మా డైరెక్టర్ వేణుకు కృతజ్ఞతలు. ట్రైలర్ మీ అందరికీ నచ్చితే థియేటర్స్ కు వచ్చేయండి. మీతో పాటు మరికొందరిని తీసుకురండి’ అని హీరో సుమంత్ ప్రభాస్ చెప్పారు. చిత్ర సమర్పకులు సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ,‘నేను సినిమా చూశాను. చాలా బాగుంది. ఈ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ ఇన్నోసెంట్ గా ఉంటుంది. అలాంటి క్యారెక్టర్ లో పర్ ఫార్మ్ చేసి మెప్పించడం కష్టం. కథ విన్నప్పుడు నేను ఎంతగా నవ్వుకున్నానో, సినిమా చూశాక అంతకంటే ఎక్కువ నవ్వాను. ఇది సూపర్ హిలేరియస్ మూవీ’ అని తెలిపారు.
ఆద్యంతం నవ్వుతూనే ఉంటారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



