Sunday, April 19, 2026
E-PAPER
Homeకరీంనగర్ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో విషాదం చోటుచేసుకున్నది. మల్లాపూర్‌ మండలం కేంద్రంలోని ఒడ్డెర కాలనీకి చెందిన దండుగుల శ్రీనివాస్ (22) అనే యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సమస్యల కారణంగా గత కొంతకాలంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాడని, దీంతో జీవితంపైన విరక్తి చెంది ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాదీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -