Thursday, August 27, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ముధోల్ లో యువకుడు ఆత్మహత్య

ముధోల్ లో యువకుడు ఆత్మహత్య

- Advertisement -

నవతెలంగాణ -ముధోల్ : నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో కొలిగల్లి కీ చెందిన   నిమ్మొల్లా గణేష్ (22)అనే యువకుడు  గురువారం ఆత్మహత్య చేసుకున్నట్లు ముధోల్ ఎస్ఐ బిట్ల పెర్సిస్ తెలిపారు. ఎస్ఐ కధనం ప్రకారం. మృతుడు గురువారం తెల్లవారుజామున ఇంటి నుండి బయటకు వెళ్లి ప్రక్కన ఉన్న ప్రయివేటు పాఠశాల దగ్గర ఉన్న చెట్లు కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. మృతుడు గత రెండు రోజుల క్రితం తన కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లి వచ్చాడు ‌. గత కొన్ని రోజులుగా మృతుడు మానసిక ఆందోళనతో బాధపడుతుండటంతో పాటు,  జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు.  మృతుడు తానుర్ లో పెయింట్ షాప్ లో కార్మికుడిగా పని చేసేవారు. తల్లి దండ్రుల కు ఏకైక కూమారుడు అయిన గణేష్ మృతి చెందటంతో కుటుంబ సభ్యులు, బంధువులు , దుఃఖ సాగరంలో మునిగిపోయారు . మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -