Hyderabad Archives - https://navatelangana.com/category/hyderabad/ Thu, 09 May 2024 06:08:00 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.2 https://navatelangana.com/wp-content/uploads/2023/04/NavTel-36x36.png Hyderabad Archives - https://navatelangana.com/category/hyderabad/ 32 32 ఘనంగా ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవ వేడుకలు.. https://navatelangana.com/celebrating-world-red-cross-day/ Thu, 09 May 2024 06:07:51 +0000 https://navatelangana.com/?p=286862 నవతెలంగాణ – సుల్తాన్ బజార్ 
ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవ వేడుకల్లో భాగంగా రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు హెన్రీ డ్యూన్నట్ పుట్టినరోజు వేడుకలు సోమజిగూడ  రాష్ట్రపతి భవన్లోని సంస్కృతి భవన్ లో ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర చైర్మన్ అజయ్ మిశ్రా ఐఏఎస్ రిటైర్డ్ చైర్మన్ మరియ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆఫ్ గవర్నర్ శ్రీ బుర్ర వెంకటేశ్వర గౌడ్ జాయింట్ సెక్రెటరీ ఆఫ్ రాజ్భవన్  భవాని శంకర్, సెక్రటరీ రఘు ప్రసాద్ గౌడ్ వేదికనలంకరించి జ్యోతి  ప్రజ్వలనం  చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ హైదరాబాద్ బ్రాంచ్ చైర్మన్ మామిడి భీమిరెడ్డి, సిపిఆర్ కన్వీనర్ డాక్టర్ విజయ భాస్కర్ గౌడ్, వైస్ చైర్మన్  విజయలక్ష్మి, క్యాంప్ కో కన్వీనర్ కల్పనా దత్త గౌడ్ ఎంసీ నెంబర్ జ్యోతి, స్వర్ణ రెడ్డి, డాక్టర్ కీర్తన, డాక్టర్ లక్ష్మి, ప్రసన్న,, లీలావతి, డా శ్రీ పూజ, డా. విష్ణు గౌడ్, పవన్, అభిషేక్, రాధా కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
]]>
టీచర్స్ కి క్వెస్ట్ ట్రైనింగ్: లయన్ డా.హిప్నో పద్మా కమలాకర్ https://navatelangana.com/teachers-quest-training-lion-dr-hypno-padma-kamalkar/ Wed, 08 May 2024 14:29:06 +0000 https://navatelangana.com/?p=286310 నవతెలంగాణ హైదరాబాద్: విద్యార్థులు బాగుంటే ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతోందని లయన్స్ ఇంటర్ నేషనల్ క్వెస్ట్ ప్రోగ్రాం ను డిజైన్ చేశారని లయన్ డా.హిప్నో పద్మా కమలాకర్ అన్నారు.డా.హిప్నో కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ లో ఋధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఇటివలే 320 లయన్స్ క్వెస్ట్ ఫౌండేషన్ మల్టీ పుల్ కో- ఆర్డినేటర్ పి.డి.జి శివప్రసాద్ ఆధ్వర్యంలో ఓరియెంటేషన్, ప్లానింగ్ ప్రోగ్రామ్ ను హోటల్ మినర్వా గ్రాండ్, సికింద్రాబాద్ లో నిర్వహించారన్నారు. ఈ కార్యక్రమంలో 320 A డిస్ట్రిక్ట్ వైస్ గవర్నర్లు డి.కోటేశ్వరరావు, డా.జి.మహేంద్రకుమార్ రెడ్డి , 2024- 2025 సంవత్సరానికి గాను క్వెస్ట్ ప్రోగ్రాం కి ఛైర్‌పర్సన్ గా మాధవరావు, కో – ఆర్డినేటర్స్ గా మహబూబ్ నగర్ జిల్లాకి చెందిన శ్రీహరిని, నన్ను (డా.హిప్నో పద్మా కమలాకర్) ను నియమించారన్నారు. విద్యార్థులకు లైఫ్ స్కిల్స్, క్యారెక్టర్ ఎడ్యుకేషన్, పాజిటివ్ బిహేవియర్, సోషల్ & ఎమోషనల్ లెర్నింగ్ ,అభ్యసనా సామర్థ్యాలు, సేవా తత్వాన్ని, అలాగే నైపుణ్య వృద్ధి, యువకుల సాధికారతకు మద్దతు ఇవ్వడం కోసం, వారిని విలక్షణంగా తీర్చి దిద్దడం కోసం , ప్రభుత్వ/ప్రైవేటు టీచర్స్ కి ఉచితంగా క్వెస్ట్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ ట్రైనింగ్ టీచర్స్ కి ఇవ్వడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతలో ఆధునిక జీవనంలోని సంక్లిష్టతలను , సవాళ్లను ఎదుర్కొనే తత్వం అలవడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో పి ఐ డి ఆర్ సునీల్ కుమార్, లయన్ కె. రేణుక, డాక్టర్ లక్ష్మిమూర్తి , పి . డి.జి.గోవింద రాజు క్వెస్ట్ ప్రోగ్రాం ఆవశ్యకత , విశిష్టతల గురించి వివరించారన్నారు.

]]>
SHR Vs LSG: ఉప్పల్ లో IPL మ్యాచ్.. రాత్రి 12 గంటల వరకు మెట్రో https://navatelangana.com/shr-vs-lsg-uppal-lo-ipl-match-till-12-pm-metro/ Wed, 08 May 2024 08:57:35 +0000 https://navatelangana.com/?p=286039 నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో బుధవారం రాత్రి SHR Vs LSG ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ చూసేందుకు భారీగా క్రికెట్ అభిమానులు స్టేడియానికి రానున్నారు. ఐపీఎల్ మ్యాచ్ సందర్బంగా మెట్రో రైల్ టైమింగ్ పొడిగించారు. మెట్రో రైళ్లు బుధవారం అర్ద రాత్రి 12:15 చివరి ట్రైన్ బయలు దేరి 1:10 వరకు చివరి టర్మినల్స్ కు చేరుకుంటుందని మెట్రో అధికారులు తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్ కు వచ్చే అభిమానూలు మెట్రో సేవలు ఉపయోగించుకోవాలని సూచించారు. ఉప్పల్ స్టేడియం, ఎంజీఆర్ ఐ స్టేషన్స్ లో ఎంట్రీ, మిగతా స్టేషన్స్ లో ఎగ్జిట్ మాత్రమే ఉండనుంది. అయితే ఈరోజు కూడా హైద్రాబాద్ లో వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి.. ఐపీఎల్ మ్యాచ్ నిర్వహణపై సస్పెన్స్ కొనసాగుతోంది. మెట్రో అధికారులు మాత్రం టైం పొడిగింపు ప్రకటించారు.

]]>
మే 6న అంతర్జాతీయ నో డైట్ డే https://navatelangana.com/may-6-is-international-no-diet-day/ Mon, 06 May 2024 09:39:52 +0000 https://navatelangana.com/?p=284511 – బాడీ షేమింగ్‌ను అంతం చేయడానికే నో డైట్ డే ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు డా.హిప్నో పద్మా కమలాకర్
నవతెలంగాణ – హైదరాబాద్: బాడీ షేమింగ్‌ను అంతం చేయడానికే అంతర్జాతీయ నో డైట్ డేని జరుపుకుంటారని ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు డా.హిప్నో పద్మా కమలాకర్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ నో డైట్ డే మే 6న జరుపుకుంటారు న్నారు. ఈ సందర్భంగా డా.హిప్నో కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ లో సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ నీవు ఎవరో తెలుసుకుంటే ఎదైనా మితంగా తీసుకోగలరన్నారు. రుచులను రుచి చూడటం నుండి ఆహారం పట్ల ఆరోగ్యకరమైన దృక్పథాన్ని పెంపొందించుకోవడం వరకు, సంతోషకరమైన భోజనాన్ని ఆస్వాదించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయన్నారు.
ప్రతి సంవత్సరం, అంతర్జాతీయ నో డైట్ డేని ఆదర్శ శరీర ప్రమాణాలను విచ్ఛిన్నం చేయడం శరీర వైవిధ్యాన్ని స్వీకరించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పడానికి జరుపుకుంటారన్నారు. ఒక రకమైన శరీరాన్ని మాత్రమే అంగీకరించే , ఇతర రకాన్ని తిరస్కరించే ప్రపంచంలో మనం పెరిగామన్నారు. దానితో మనం మన స్వంత శరీర రకాలను అంగీకరించకపోవడం వల్ల మానసిక సమస్యలకి లోనవుతున్నారన్నారు. మనం ఎలా ఉన్నామో మనల్ని మనం ఆలింగనం చేసుకోవాలన్నారు. ప్రతి సంవత్సరం, శరీర సానుకూలత , శరీర వైవిధ్యాన్ని పునరుద్ధరించడానికి బరువు వివక్ష అంతం చేయడంలో సహాయపడటానికి నో డైట్ డేని జరుపుకోవాలని చెప్పారు.  బరువు, కొవ్వును తగ్గించుకోవడానికి మనకు నచ్చని ఆహార పదార్థాలను తింటామన్నారు. అందువల్ల భోజనాన్ని ఆస్వాదించలేక ఒత్తిడికి లోనవుతున్నారన్నారు. ఎలాంటి ఆంక్షలు లేని సంతోషకరమైన భోజనం రుచులను రుచి చూడడం దానిని ఆస్వాదించడం వల్ల ఒత్తిడి తగ్గుతుందన్నారు. కొత్త వంటకాలు, ఆహార పదార్థాలు ప్రయత్నించడం వల్ల మరింత చురుకుగా పని చేయగలరున్నారు.  ఆరోగ్యకరమైన వైఖరి, ఆలోచనలు, సంతోషకరమైన దృక్పథాన్ని పెంపొందిస్తుంది న్నారు. ఇది తినే రుగ్మతలను పరిష్కరిస్తుందని తెలిపారు. ఎక్కువ ఆహారం తీసుకోవాలనే కోరికను తగ్గిస్తుంది న్నారు. సంతోషంగా భోజనం చేయడం వల్ల మనం సంతృప్తి చెందుతామన్నారు. ఇది మానసిక స్థితిని పెంచి మంచి అనుభూతి చెందడానికి సహాయపడుతుందని తెలిపారు. బరువు పెరుగుతున్నామనుకుని తిండిమానేయడం, అసలు ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా కనిపించిందల్లా తినడం రెండూ పొరపాటేనన్నారు. నీరు త్రాగడం ఆకుకూరలు, కాయగూరలను ప్రతి భోజనంలో భాగం చేసుకోవాలన్నారు. కాయగూరల్లో ఉండే విటమిన్లు శరీరానికి మేలు చేయడమే కాక పీచునూ అందించి పొట్ట నిండేలా చేసి, ఆకలినీ తగ్గిస్తాయని చెప్పారు. మెడిటేషన్ , యోగా, నడవడం రోజూ 30 నిమిషాలు చేయాలని తెలిపారు. చిన్న చిన్న వ్యాయామాలను ప్రాక్టీస్ చేయించారు. ఈ కార్యక్రమంలో షేక్ హాలిమా రూహి, జి.హిమకర్, ఉషా , సాహితీ, లలిత, రాణి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ‌‌.

]]>
వేసవి సెలవుల్లో విజ్ఞాన శిభిరం https://navatelangana.com/science-camp-during-summer-holidays/ Sun, 05 May 2024 17:16:33 +0000 https://navatelangana.com/?p=284216 Science camp during summer holidays– సృజనాత్మకతను వెలికితీసేలా..
– విజ్ఞానం ,వినోదం, వివేకం తో పాటు సరదాగా సాగిపోయే తెలంగాణ బాలోత్సవం  సమ్మర్ క్యాంప్
నవతెలంగాణ – హైదరాబాద్:
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 200 మంది విద్యార్థులతో విజ్ఞానదాయకంగా ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర బాల సాహితీ వేత్త చొక్కాపు వెంకటరమణ మాట్లాడుతూ బాలబందువు తెలంగాణ బాలోత్సవం అని అన్నారు హైదరాబాద్ లో సమ్మర్ క్యాంపు అంటే రూ.10 వేయిల నుండి రూ.20 వరుకు చెల్లించాల్సిందే  కానీ….మన ” తెలంగాణ బాలోత్సవం” ఉచిత సమ్మర్ క్యాంపు మే 5 నుండి 22 వరుకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగ్ లింగంపల్లి హైదరాబాద్ అందమైన, విశాలమైన హాలులో ఏకకాలంలో, అటు ఆటలు, ఇటు విజ్ఞానాన్ని అందించి, ఉత్సాహాన్ని ఉల్లాసానందించే..ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఇది పోటీ ప్రపంచం అని చదువొక్కటే పరిష్కారం కాదు. ఏదైనా కళలలోనూ ..క్రీడలలోనూ.. ప్రావీణ్యత సాధించాలి. ప్రావీణ్యత అంటే…? Extra qualification అదనపు అర్హతగా గుర్తిస్తున్నారని వేసవి సెలవుల్లో .. కాలాన్ని వృధాగా పోనీయకుండా కొత్త కళలను, సరికొత్త పనుల్లో ప్రావీణ్యాన్ని సంపాదించేందుకు పిల్లలు ఉత్సాహం చూపుతున్నారని ప్రతి పిల్లవాడిలోనూ సృజనాత్మకత దాగి ఉంటుంది. దాన్ని గుర్తించి వెలికి తీయడమే తెలంగాణ బాలోత్సవం నిరంతరం పిల్లల్లో పనిచేస్తుందని అన్నారు ఇందులో భాగమె ఉచిత సమ్మర్ క్యాంపుల ముఖ్య ఉద్దేశం. చిన్నారుల్లో జ్ఞాపకశక్తిని ఫోకస్ చేసి ప్రతిభ పాటవాలను మెరుగుపరిచే విజ్ఞాన క్యాంపు సమ్మర్ క్యాంపు అని అన్నారు
విజ్ఞానదర్శిని టి.రమేష్ మాట్లాడుతూ పిల్లలకు విజ్ఞాన శాస్త్ర విషయాలు సామాజిక పర్యావరణ విషయాలు పిల్లలకు ప్రయోగం నైపుణ్యాలు ప్రకృతి పాఠాలు మానవ సంబంధాలు పెంపొందించడం ఇతరుల నుండి ఎలా నేర్చుకోవాలి స్నేహితులను ఎలా సంపాదించుకోవాలి సెల్ ఫోనుకు ఎంత దూరం ఉండాలి అనేక విషయాలు ఈ సమ్మర్ క్యాంపులో నేర్పిస్తామని అన్నారు తెలంగాణ బాలోత్సవం అద్యక్షుడు భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..” చెరువులు పెద్ద చేప లేకపోతేనే.. అన్నింటికన్నా చురుకైన చేపల ఉండాలని” ఒకరిని అనుకరించడం కాకుండా నీ శక్తిని నువ్వు తెలుసుకోవాలని పిల్లలకు బోధించారు. ఆంగ్ల భాష మోజులో పడి తెలుగు మరిచిపోతున్న ఈతరానికి తెలుగు మాధుర్యాన్ని పంచే బాధ్యత అమ్మధనాన్ని తెలుగుధనాన్ని తెలంగాణ బాలోత్సవం నేర్పిస్తుందని అన్నారు.
మే 22 న పిల్లలు నేర్చుకున్నా విషయాలు తల్లిదండ్రుల సమక్షంలో ప్రతిబోత్సవం పేరుతో ప్రదర్శన ఉంటుందని ప్రతి పిల్లవాడు సమ్మర్ క్యాంపు ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు
ఈ కార్యక్రమంలో తెలంగాణ బాలోత్సవం కార్యదర్శి ఎన్ సోమయ్య ఉపాద్యక్షురాలు మమత కే.సుజావతి కోశాధికారి జి బుచ్చిరెడ్డి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు చొక్కాపు వెంకటరమణ గారి మెజిషియన్ షొ అద్భుతంగా అలరించినది పిల్లలు ఆట పాటలతో సరదా గా సందడిగా సాగింది 17 రోజులు సాగే సమ్మర్ క్యాంపు విధివిధానాలను వివరించారు.

]]>
తెలంగాణలో కాంగ్రెస్ నేత దారుణ హత్య.. బహిరంగ సభలో ఘటన https://navatelangana.com/the-brutal-murder-of-a-congress-leader-in-telangana-happened-in-a-public-meeting/ Sun, 05 May 2024 02:11:42 +0000 https://navatelangana.com/?p=283816 నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బహిరంగ సభలో కాంగ్రెస్ నేత దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్‌ శివారు ప్రాంతమైన రాజేంద్రనగర్‌లోని హసన్‌నగర్‌లో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. బహిరంగసభ మధ్యలో నుంచి తరుముకుంటూ వెళ్లి.. వెంటాడి మరీ అందరూ చూస్తుండగానే దారుణంగా గొంతు కోసి హత్య చేసినట్టు తెలుస్తోంది. దీంతో బహిరంగ సభ రాసభాసగా మారింది. భయాందోళనతో జనం పరుగులు తీశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బాధితుడ్ని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also : తెలంగాణలో ఒక్కరోజే 19 మంది మృతి..బయటకు రాకండి

]]>
రాయదుర్గంలో దారుణ హత్య… https://navatelangana.com/brutal-murder-in-rayadurgam/ Sat, 04 May 2024 06:07:24 +0000 https://navatelangana.com/?p=283153 నవతెలంగాణ హైదరాబాద్: రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ వెంకన్న కథనం ప్రకారం.. యూసుఫ్‌గూడకు చెందిన చెల్లూరి శ్రీనివాస్‌(54) కొండాపూర్‌ వైట్‌ ఫీల్డ్స్‌ విల్లాస్‌లో ఉంటున్నారు. అంజయ్యనగర్‌లో తన కుమారుడు కేశవ్‌ వినయ్‌(28)తో కలిసి సీఎస్‌ డెలాయిట్‌ ఇన్‌ హోటల్‌ నిర్వహిస్తున్నారు. ఆయన హోటల్‌ వెనుక స్టోర్‌ రూం కోసం గది అద్దెకు తీసుకున్నారు. ఏడాది క్రితం స్టోర్‌ రూం ఎదుట రోడ్డుపై ఆటో ట్రాలీ పార్క్‌ చేసి సరకులు దించుకుంటున్నారు. ఆటో ట్రాలీ పార్కింగ్‌ వల్ల దారిలో రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని పక్కింట్లో ఉండే మహేందర్‌(35) అనే వ్యక్తి శ్రీనివాస్‌తో గొడవపడ్డాడు. నాడు స్థానికులు అతడినే వారించి గొడవ సద్దుమణిగేలా చూశారు. తన పరువు తీశాడని కక్ష కట్టిన మహేందర్‌ అప్పటి నుంచి అతన్ని అంతమొందించాలనుకున్నాడు. అందులో భాగంగా గురువారం సాయంత్రం హోటల్‌లోకి ప్రవేశించి సోఫాలో కూర్చొని ఉన్న శ్రీనివాస్‌పై ఇనుప రాడ్డుతో విచక్షణారహితంగా దాడి చేశాడు. అక్కడే ఉన్న కేశవ్‌, హోటల్‌ సిబ్బంది మహేందర్‌ను అడ్డుకుని శ్రీనివాస్‌ను కేర్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి 11.45కు ప్రాణాలు కోల్పోయారు. కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శ్రీనివాస్‌ మరణంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయనకు మరో కుమారుడు ఉన్నారు. అవివాహితుడైన మహేందర్‌ ఎంబీఏ ఫైనాన్స్‌ చేసి ఉద్యోగం చేయకుండా ఖాళీగా ఉంటున్నాడు. ఉద్యోగం చూసుకోవాలని కుటుంబ సభ్యులు చెప్పినా పెడచెవిన పెడుతుంటాడు.

]]>
జీహెచ్‌ఎంసీ కార్మికులకు అండగా ఉంటా https://navatelangana.com/ghmc-stands-by-the-workers/ Wed, 01 May 2024 20:00:04 +0000 https://navatelangana.com/?p=281658 నవతెలంగాణ-అంబర్‌పేట
జీహెచ్‌ఎంసీ కార్మికులను ఎన్‌సీఏ సన్మా నించడం, బహుకరించడం చాలా గర్వంగా ఉంద ని జీహెచ్‌ఎంసీ ఏఎంహెచ్‌ఓ డాక్టర్‌ హేమలత అన్నారు. మేడే సందర్భంగా నల్లకుంట సిటిజెన్స్‌ అసోసియేషన్‌ (ఎన్‌సీఏ) ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడా రు. డాక్టర్‌ హేమలత మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ కార్మికుల శ్రమ చాలా గొప్పదని, ఉదయం లేచి రోడ్లు ఊడ వడం లాంటి అనేక పనుల్లో కార్మికుల శ్రమను గుర్తించాలన్నారు. ఎంసీఏ ఎన్‌సీఏ అసోసియేషన్‌కు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తామని, అన్ని సమయాల్లో అన్నదండగా ఉంటామన్నారు. ఎంసీఏ అధ్యక్షులు మోహన్‌ రావు , నాయకులు భవాని శంకర్‌, రామ్‌ కుమార్‌ మాట్లాడుతూ మేడే ప్రాముఖ్యతను, మేడే పోరాటాలను వివరిస్తూ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి నిర్వహణ కార్యదర్శి వీరయ్య అధ్యక్షత వహించి ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మేడే సందర్భంగా 15 మంది జీహెచ్‌ఎంసీ కార్మికులకు శారీలను బహుకరిం చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్వైజర్‌ రమేష్‌ నాయుడు, ప్రధాన కార్యదర్శి మోహన్‌ నాయుడు, ఎంసీఏ నాయకులు వినోద్‌ నాయుడు, శ్రీనివాసరావు, హర్ష, సత్యనారా యణ, కష్ణ బాబు, కిషన్‌ రావు, అజరు రెడ్డి, వెంకటస్వామి, రమణ, సురేష్‌, ప్రశాంత్‌, శ్యామ్‌, శివ పాల్‌, జై చంద్ర, సోమశేఖర్‌, సుశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

]]>
కష్టజీవుల విముక్తి బావుటా మేడే… https://navatelangana.com/may-the-liberation-of-the-poor-be-made/ Wed, 01 May 2024 19:58:42 +0000 https://navatelangana.com/?p=281647 – మతోన్మాద కార్పొరేట్‌ శక్తులను గద్దె దించండి
నవతెలంగాణ-దుండిగల్‌
నిజాంపేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రగతి నగర్‌లో సీఐటీయు, సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో138 వ మే డే దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు బి. వెంకటరామయ్య హాజరై వివిధ చోట్ల జెండా ఆవిష్కరణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు తమ రక్తం దార పోసి శ్రమిస్తే వచ్చే అదనపు లాభం ద్వారానే పెట్టుబడుదారులు సంపద పోగేస్తున్నారని కార్మికుల అదనపు విలువ పంపిణీ జరగాల్సిందేనని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు బి.వెంకట రామయ్య తెలిపారు. పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని రద్దుచేసి కేంద్ర ప్రభుత్వం 12 గంటల పని దినం తీసుకురావడం అంటే శ్రామికుల శ్రమను దోపిడి చేయడమేనని పెట్టుబడుదారుల కొమ్ముగాయడమేనన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక కర్షకుల జీవితాలతో చలగాటమాడుతుందన్నారు. మే డే దినోత్సవ సందర్భంగా బీజేపీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా ఉందన డానికి నిదర్శనం ఉపాధి హామీలో బడ్జెట్‌లో నిధులు తగ్గించటం అన్యా యమన్నారు. పార్లమెంట్‌ ఎన్నికలలో మత ఉన్మాద బీజేపీనీ ఓడించి. ఎన్నికలలో మే 13న జరిగే పార్లమెంటు ఎన్నికల్లో రాజ్యాంగ ప్రకారం పాలించే పార్టీలు కాంగ్రెస్‌ కమ్యూనిస్టులు ఒకే వేదికపై వచ్చి ఇండియా కూటమి ఏర్పడిన అభ్యర్థులను అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. మండలంలో ఆటో స్టాండ్‌ మేడే జెండా ఆవిష్కరణ నిర్వహించారు. సీఐటీయు మండల బాచుపల్లి మండల కన్వీనర్‌ వెంక ట రాజ్యం, ఎల్లమ్మ, కష్ణయ్య, పెంటయ్య, మణీ లక్ష్మమ్మ, నాగ శేషు మల్లికార్జున్‌, తదితరులు పాల్గొన్నారు.

]]>
కార్మిక సోదరుల అలుపెరగని శ్రమ వెలకట్టలేనిది https://navatelangana.com/the-tireless-efforts-of-the-labor-brothers-are-priceless/ Wed, 01 May 2024 19:57:26 +0000 https://navatelangana.com/?p=281653 – ఎమ్మెల్సీ, బీఆర్‌ఎస్‌ మేడ్చల్‌ జిల్లా అధ్యక్షులు శంభిపూర్‌ రాజు
నవతెలంగాణ-దుండిగల్‌
అంతర్జాతీయ ”కార్మికుల దినోత్సవం” మే డే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగం జెండాను ఆవిష్కరించిన మేడ్చల్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభిపూర్‌ రాజు అంతర్జాతీయ ”కార్మికుల దినోత్సవం” మే డే సందర్భంగా నిజాంపేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ప్రగతి నగర్‌ అమరవీరుల స్తూపం వద్ద టి టీఆర్‌ఎస్‌ కెవి సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగం జెండాను ఆవిష్కరించి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపిన మేడ్చల్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభిపూర్‌ రాజు, కార్యక్రమంలో డీప్యూటీ మేయర్‌ ధనరాజ్‌ యాదవ్‌ ,ఎన్‌ ఎంసి బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్‌, బౌరంపేట్‌ పాక్స్‌ చైర్మెన్‌, కార్పొరేటర్లు ,కో-ఆప్షన్‌ సభ్యలు, సీనియర్‌ నాయకులు, నాయకులు, మహిళా నాయ కులు, ఉద్యమకారులు, టీఆర్‌ఎస్‌కె.వి నాయకులు, కార్మిక సోదర సోదరీమణులు, తదితరులు పాల్గొన్నారు.

]]>
కార్మికుల్లో స్ఫూర్తిని రగిలిస్తూ వేసిన ముందడుగే ‘మేడే’ https://navatelangana.com/mayday-was-the-first-step-to-ignite-the-spirit-of-the-workers/ Wed, 01 May 2024 19:56:10 +0000 https://navatelangana.com/?p=281650 నవతెలంగాణ – హయత్‌నగర్‌
మేడే స్ఫూర్తితో భవిష్యత్‌ ఉద్యమాలకు రూపకల్పన చేసుకోవాలని సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్ర చారి అన్నారు. మే డే ఉత్సవాలను హయత్‌ నగర్‌ మండల సమితి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అధ్యక్షులు గోల్కొండ నాగరాజు సారధ్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. తర్వాత ఆటోనగర్‌ ఇసుక లోడింగ్‌ అన్లోడింగ్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరై ఏఐటీయూసీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా సబ్‌ కమిటీ సభ్యులు సామిడి శేఖర్‌ రెడ్డి, ఏఐటీయూసీ మండల కార్యదర్శి రమావత్‌ సక్రు నాయక్‌, ఎ.ఐ.వై.ఎప్‌ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పోలోజు, లక్షణాచారి ఎ.ఐ.యస్‌.ఎప్‌ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు సామిడి వంశీ వర్ధన్‌ రెడ్డి, మండల సహాయ కార్యదర్శి శ్రీదేవి, ఇసుక లోడింగ్‌ అన్లోడింగ్‌ సంఘం కార్యదర్శి సురేందర్‌, మహిళా సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు సుజాత, సరిత, అటో ట్రాలీ యూనియన్‌ అధ్యక్షుడు బిచుపల్లి. శంకర్‌, బి.ఒ.సి. నాయకులు జాని, వేంకట్‌, చంది వేంకట్‌, యువజన సంఘం నాయకులు శోభన్‌, యనమల్ల.శ్రీకాంత్‌, ముత్తయ్య, రాములు, సోషల్‌ మిడియా వారియర్స్‌ మమత, ప్రజాసంఘాల నాయకులు, కార్మిక శ్రేణులు పాల్గొన్నారు.

నవతెలంగాణ – హయత్‌ నగర్‌
మే డేను పురస్కరించుకొని హయత్‌నగర్‌లోని ఆర్టీసీ 1,2 డిపోల వద్ద, బొమ్మల గుడి, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వద్ద, హయత్‌ నగర్‌ బస్‌ స్టాండ్‌లలో జెండాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా శాఖ ఆర్గనైజర్‌ భీమనపల్లి కనకయ్య, కామ్రేడ్‌ శ్రీనివాస్‌ రెడ్డిలు మాట్లాడుతూ పార్లమెంట్‌ ఎన్నికల్లో కార్మికుల పక్షాన మాట్లాడేటటువంటి సీపీఐ(ఎం) అభ్యర్థి కామ్రేడ్‌ జహంగీర్‌ను గెలిపించాలని ప్రజలను కోరారు.

నవతెలంగాణ- నాగోల్‌
సీఐటీయూ ఆధ్వర్యంలో నాగోలు డివిజన్లో బుధవారం మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. న్యూ నాగోల్‌ భవన నిర్మాణ కార్మిక సంఘం కోశాధికారి ఎండి లతీఫ్‌ అధ్యక్షతన నిర్వహించిన మే డే ఉత్సవాలకు భవన నిర్మాణ కార్మిక సంఘం సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కోశాధికారి జి చైతన్య, కేవీపీఎస్‌ రాష్ట్ర కమిటీ సభ్యుడు జి మనోహర్‌, సరూర్నగర్‌ సర్కిల్‌ సీఐటీయూ కన్వీనర్‌ మల్లెపాక వీరయ్యలు ముఖ్య అతిథులుగా హాజరై సీఐటీయూ జెండాను ఎగరవేశారు. ఈ వేడుకల్లో సీపీఐ(ఎం) పార్టీ కన్వీనర్‌ సిహెచ్‌ వెంకన్న, ఆంజనేయులు, రజక సంఘం సి మల్లేష్‌, న్యూ నాగోల్‌ కమిటీ అధ్యక్షులు డి. రవి, కమిటీ సభ్యులు మీ సైదయ్య, ఎం జానకి రాములు, తదితరులు పాల్గొన్నారు.

నవతెలంగాణ – నాగోల్‌
మేడే సందర్భంగా నాగోలు ప్రధాన కూడలి గాంధీ సెంటర్లో బుధవారం భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జెండా ఎగురవేశారు. ఈ వేడుకలలో ఉప్పల్‌ మండల కార్యదర్శి పులిరాం నారాయణ, భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షులు ఉడతల మల్లేష్‌ గౌడ్‌, ఏఐటీయూసీ, సీపీఐ నాయకులు రాష్ట్ర కమిటీ సభ్యులు బొడ్డుపల్లి కష్ణ, భూపతి, సురేష్‌, ఎండి బషీర్‌, వెంకటేశ్‌, రాములు, జంగయ్య, నర్సింహా రావు, సైదరావు తదితరులు పాల్గొన్నారు.

శ్రమిద్దాం.. శ్రమని గౌరవిద్దాం..
నవతెలంగాణ – చైతన్యపురి
శ్రమిద్దాం.. శ్రమని గౌరవిద్దాం అని రంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి పి. శ్రీదేవి అన్నారు. వనస్థలిపురంలోని అంకిత ఎన్జీఓ, డిఎల్‌ఎస్‌ఏ ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లా డారు. ఈ కార్మిక దినోత్సవ ఆవిర్భావం ఏ ఒక్క దేశం, సంఘటనకో పరిమితం కాదు.. శ్రమదోపిడిని నిరసిస్తూ యావత్‌ ప్రపంచ కార్మికుల్లో స్ఫూర్తిని రగిలిస్తూ వేసిన ముందడుగే ‘మేడే’ అని అన్నారు. అనంతరం అంకిత వారి ఆధ్వర్యంలో అర్హులైన వారికి లేబర్‌ కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మం, హిరియా నాయక్‌, డాక్టర్‌ బిగాడ్‌ అహ్మద్‌, దేవేంద్ర చారి, తౌఫీఖ్‌ కార్మికులు పాల్గొన్నారు.

నవతెలంగాణ-తుర్కయంజాల్‌
ప్రపంచ కార్మిక దినోత్సవం మే డేను పురస్కరించుకొని తుర్కయంజాల్‌ మున్సిపల్‌ పరిధిలోని కోహెడ, తొర్రూరు, మునగనూర్‌, బ్రాహ్మణపల్లి, ఇంజాపూర్‌, కమ్మగూడ, రాగన్నగూడ, తుర్కయంజాల్‌ గ్రామాల్లో సీఐటీయూ ఆధ్వర్యంలో వివిధ రంగాల, పరిశ్రమల కార్మికులు బుధవారం ఎర్రజెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా తుర్కయంజాల్‌ చౌరస్తా అంబేద్కర్‌ విగ్రహం నుండి రొక్కం సత్తిరెడ్డి కళ్యాణ మండపం వరకు కార్మికులు, ఉద్యోగులు భారీ ప్రదర్శన నిర్వహించి హాల్‌ ఎదుట జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు డి. కిషన్‌ అధ్యక్షతన జరిగిన సభలో సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కె. భాస్కర్‌ తుర్కయంజాల్‌ సీఐటీయూ నాయకులు ఎం. సత్యనారాయణ, కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి ప్రకాష్‌ కరత్‌, అడ్వకేట్‌ కె. అరుణ్‌ కుమార్‌, నాయకులు భాస్కర్‌, శంకర్‌, వెంకట కష్ణ, శంకరయ్య, మాల్యాద్రి, కష్ణ, రవి, మధు, శారద, బీరప్ప, బాల్‌ రాజ్‌, ఆశీర్వాదం, మాధవ రెడ్డి, జాఫర్‌, మెతరి దాసు, నవీన్‌, మహేష్‌, యాదగిరి, గోపాల్‌, శ్రీను, రవి, లక్ష్మి, జంగమ్మ, పుష్పమ్మ, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.

నవతెలంగాణ- నాగోల్‌
నాగోల్‌ డివిజన్‌ జైపూర్‌ కాలనీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బుధవారం మేడే సందర్భంగా జైపూర్‌ కాలనీ చౌరస్తాలో జెండా ఎగుర వేశా రు. ఈ కార్యక్రమంలో బషీర్‌ అలీ, జైపూర్‌ కాలనీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్యామల యాదగిరి, కాలనీ వైస్‌ ప్రెసిడెంట్‌ శంకర్‌, శ్రీనివాసులు, జనరల్‌ సెక్రెటరీ రాహుల్‌ పోతని, జాయింట్‌ సెక్రెటరీ కస్తూరి అశోక్‌, రాజు యాదవ్‌, శ్రీశైలం యాదవ్‌, రమేష్‌, అమరేందర్‌, శ్రీనివాస్‌ సిహెచ్‌.వెంకటేష్‌, రాజ మల్లయ్య, ఏ వెంకటేష్‌, కాలనీవాసులు పాల్గొన్నారు.

నవతెలంగాణ – బడంగ్‌పేట్‌
ప్రజా పోరాటాలతోనే కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని బడంగ్‌పేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చిగిరింత మేయర్‌ పారిజాత నర్సింహారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్‌పేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కుర్మల్‌గూడ 10వ డివిజన్‌లో జన్నారం కాలనీలో బుధవారం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలకు మేయర్‌ హాజరై జెండా ఆవిష్కరించారు. అనంతరం బడంగ్‌పేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కుర్మల్‌గూడ10వ డివిజన్‌ జన్నారం కాలనీలో రికవరీ హాస్పిటల్‌ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో మేయర్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కంగర్‌ అండ్‌ కరంచారి కాంగ్రెస్‌(కె.కె.సి) పార్టీ చైర్మన్‌ కౌసల్‌ సమీర్‌, ప్రధాన కార్యదర్శి రుద్రాక్షణ మల్లేష్‌, కె.కె.సి పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మైన, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కవిత, నాయకులు ఆనంద్‌ రెడ్డి, ఎల్లేష్‌, జంపయ్య, మధు పాల్గొన్నారు.

నవతెలంగాణ – చైతన్యపురి
సీఐటీయూ సరూర్‌నగర్‌ సర్కిల్‌ కన్వీనర్‌ మల్లెపాక వీరయ్య ఆధ్వర్యంలో మేడే వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్‌ వెంకన్న, మనోహర్‌, జీ చైతన్య, సి నవీన్‌, ఎండి లతీఫ్‌ , మున్సిపల్‌ కార్మికులు పాల్గొన్నారు.

నవతెలంగాణ – ఎల్బీనగర్‌
జీహెచ్‌ఎంసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో కర్మన్‌ ఘాట్‌ చౌరస్తాలో మే డే సంద ర్భంగా సీఐటీయూ జెం డాను మహిళా కార్మికురాలు పొన్నమ్మ ఎగురవేశారు. అనంతరం సీఐ టీయూ జీహెచ్‌ఎంసీ ఎంప్లా‌యిస్‌ యూనియన్‌ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఆలేటి ఎల్లయ్య, జిల్లా కార్యదర్శి పి శ్రీనివాస్‌లు మాట్లాడుతూ ప్రపంచ కార్మికుల్లారా ఏకంకండి..మతోన్మాద విచ్ఛిన్నకరమైన శక్తులను ఓడించండి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జంగయ్య, జీహెచ్‌ఎంసీ సూపర్వైజర్‌ రావుల శేఖర్‌, సంతోష్‌ వినరు రావు, కార్మికులు జయమ్మ, మంజుల, కళావతి, స్వరూప, రాజేశ్వరి, జి లక్ష్మి, అనురాధ, హేమలత, ఎన్‌ లక్ష్మి పాల్గొన్నారు.

నవతెలంగాణ-తుర్కయంజాల్‌
మేడే స్ఫూర్తితో కార్మికులు తమ సమస్యలపై పోరాటాలు చేయాలని ఏ ఐటీ యూసీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఓరుగంటి యాదయ్య కార్మికులకు పిలుపు నిచ్చారు. మే డే దినోత్సవం సందర్భంగా తుర్కయంజాల్‌ చౌరస్తాలో ఆటో కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణకు ఆయన ముఖ్య అతి థిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఏఐ ఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షులు పి. శివకుమార్‌, ఏఐటీయూసీ నాయకులు కాటంరాజు, కొండి గారి శివ, గువ్వలరాజు, చెక్క యాద గిరి, భాస్కర్‌, ఆనంద్‌ సుందరమ్మ, మల్లేష్‌, శ్రీకాంత్‌, విజయ శ్రీనివాస్‌, కష్ణ, నారా యణ, నాగరాజు, నాగేశ్వర్‌ పాల్గొన్నారు.

నవతెలంగాణ- హస్తినాపురం
హస్తినాపురం డివిజన్‌ పరిధిలోని భూపేష్‌ గుప్తా నగర్‌లో మేడే సందర్భంగా సీపీఐ(ఎం) నాయకులు మంథని యాదయ్య బుధవారం జెండా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రంగా రెడ్డి జిల్లా అధ్యక్షులు ఆలేటి ఎల్లయ్యతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు గడ్డం రవీందర్‌, కే.రాములు, కస్తూరి శ్రీను, మహిళా సంఘం నాయకులు కమార్‌ , సంతోష్‌, శ్రీను, మున్సిపల్‌ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

నవతెలంగాణ – బడంగ్‌పేట్‌
బడంగ్‌పేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని కాలనీలో ప్రజా కార్మిక సంఘం, తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నబారు ఆధ్వర్యంలో మే డే సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు యాదయ్య, యాదగిరి చారి, కమిటీ సభ్యులు భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.
అదేవిధంగా జల్‌పల్లి మున్సిపల్‌ పరిధిలో ఉన్న శ్రీరాం కాలనీలో మహేశ్వరం నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం అధ్యక్షులు గౌడల్లి దామోదర్‌ రెడ్డి ఆధ్వర్యంలో మే డే సందర్భంగా జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ కంపెనీల్లో పనిచేసే కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

నవతెలంగాణ – మీర్‌ పేట్‌
మీర్‌పేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని జిల్లెలగూడలో మేడే సందర్భంగా జెండా ఆవిష్కరణ చేస్తున్న సీఐటీయూ నాయకులు దాసరి బాబు, యాదగిరి చారి, యాదగిరి తదితరులు..
నవతెలంగాణ- సంతోష్‌నగర్‌
మే డే సందర్భంగా సింగరేణి కాలనీలో సీపీఐ సీనియర్‌ నాయకుడు శంకర్‌ నాయక్‌, డివిజన్‌ కార్యదర్శి షేక్‌ మహమూద్‌, ఏఐటీయూసీ ఆటో యూనియన్‌ హైదరాబాద్‌ కార్యదర్శి జంగయ్య, సీపీఐ నాయకులు అంజయ్య, శామ్‌, రవి తదితరులు జెండాను ఎగురవేశారు.

]]>
మతోన్మాద విచ్ఛిన్నకర శక్తులను ఓడించండి https://navatelangana.com/defeat-the-destructive-forces-of-fanaticism/ Wed, 01 May 2024 19:46:36 +0000 https://navatelangana.com/?p=281642 – సీఐటీయూ మేడ్చల్‌ జిల్లా నాయకులు ఎం.చంద్రశేఖర్‌
నవతెలంగాణ-దుండిగల్‌
మతోన్మాద విచ్చిన్నకర శక్తులను ఓడించాలని సీఐటీయూ మేడ్చల్‌ జిల్లా నాయకులు ఎం. చంద్రశేఖర్‌ అన్నారు. 138వ మే డే కార్మిక దినోత్సవం సందర్భంగా బాచుపల్లి ఇండిస్టియల్‌ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో బాచుపల్లి ఇండిస్టియల్‌ ఏరియా బాచుపల్లి ఎస్సీ కాలనీ ఇంద్రానగర్‌ మున్సిపల్‌ వార్డు ఆఫీస్‌ రాజీవ్‌ గాంధీ నగర్‌లలో విస్తతంగా జండా ఆవిష్కరణలు ర్యాలీ, సభ నిర్వహించారు. పతాకావిష్కరణలు మున్సిపల్‌ నాయకు రాలు ఎన్‌ ఎల్లమ్మ, పెంటమ్మ, కే.లక్ష్మి, సీఐటీయూ జిల్లా నాయకులు ఎం.చంద్రశేఖర్‌, స్థానిక నాయకులు మాణిక్యం ఎన్‌.యాదయ్య రాజశేఖర్‌ చేశారు. ఈ సందర్భంగా ఎం.చంద్రశేఖర్‌ మాట్లాడుతూ మేడే పోరాట స్ఫూర్తితో పెట్టుబడి దారుల పాలకవర్గాల దోపిడీ దాడులు అణిచివేతలు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడి హక్కులు సాధించుకుంటూ వర్గ ఐక్యతను కాపాడుతున్న శ్రామిక ప్రజలకు కార్మిక దినోత్సవం మే డే శుభాకాంక్షలు తెలియజేశారు. మేడే అంతర్జాతీయ కార్మిక వర్గ ఐక్యతకు సంకేతమన్నారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను, హక్కులను మోడీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. 4 లేబర్‌ కోడ్స్‌ తీసుకువచ్చి కార్మికులను పెట్టుబడిదారులకు బానిసలుగా తయారు చేస్తున్నా రన్నారు. బీజేపీ ప్రభుత్వం లౌకిక ప్రజాతంత్ర మాలిక విలువలనే మట్టి పెట్టేస్తుంది అన్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకోవాలని అధికారం చాలాయించాలని చూస్తుందన్నారు. మే డే స్ఫూర్తితో సాధించుకున్న ఎనిమిది గంటల పని దినం కార్మిక చట్టాలు హక్కులను రక్షించుకోవాలని పిలుపు నిచ్చారు. కార్మిక వ్యతిరేక కార్పొరేట్‌ మతోన్మాద బీజేపీ పార్టీని 2024 పార్లమెంటు ఎన్నికల్లో ఓడించాల్సిన బాధ్యత కూడా కార్మిక వర్గానీదేనని పిలుపునిచ్చారు. మేడే వర్థిల్లాలి సోషలిజం వర్ధిల్లాలి శ్రామిక వర్గ అంతర్జాతీయ వాదం వర్ధిల్లాలి శ్రామిక కర్షక ఐక్య పోరాటాలు వర్ధిల్లాలి సామ్రాజ్యవాదం నశించాలి అని నినదించారు. ఈ కార్యక్రమంలో నరసింహ శ్రీను వెంకట్‌ శివ రాజశేఖర్‌ విటల్‌ పద్మ లక్ష్మీ సతీష్‌ తదితర నాయకులు కార్యకర్తలు కార్మికులు పాల్గొన్నారు.

]]>