రేపటి నుంచి స్కూళ్లకు సెలవులు..
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లకు రేపటి నుంచి 3 రోజులు సెలవులు రానున్నాయి. తెలంగాణలో 24న క్రిస్మస్ ఈవ్ సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఇచ్చారు. 25న క్రిస్మస్, 26న బాక్సింగ్ డే సందర్భంగా జనరల్ హాలిడేస్ ప్రకటించారు. అటు ఏపీలో 24, 26న ఆప్షనల్, 25న జనరల్ హాలిడేస్ ఇచ్చారు. జనరల్ హాలిడే రోజు అన్ని స్కూళ్లు, ఆఫీసులకు సెలవు ఉండనుంది. ఆప్షనల్ హాలిడేకు కొన్ని స్కూళ్లు సెలవు ప్రకటిస్తాయి.
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed