Magazines

రాంటెక్‌లో సోయా పంట దిగుబడి అంచనా

1 గంట క్రితం

mudhol
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ – ముధోల్
ముధోల్ మండలంలోని రాంటెక్ గ్రామంలో శనివారం సోయా పంట దిగుబడి అంచనా కార్యక్రమాన్ని జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి పొద్దుటూరి గంగారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రతి సంవత్సరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పంటల బీమా పథకాలకు సంబంధించి బీమా వర్తింపునకు అవసరమైన పంట దిగుబడి అంచనాలను జిల్లాలో రాండమ్ పద్ధతిలో సేకరిస్తారు. ఈ ప్రక్రియలో భాగంగా ఎంపిక చేసిన గ్రామాల్లో పంట కోత ప్రయోగాలు నిర్వహించి దిగుబడిని అంచనా వేస్తారు.


రాం టెక్ గ్రామంలో నిర్వహించిన పంట కోత ప్రయోగంలో సోయా పంట దిగుబడిని జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి పొద్దుటూరి గంగారెడ్డి పరిశీలించి వివరాలను సేకరించారు. జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రతి సంవత్సరం వివిధ పంటల దిగుబడులను శాస్త్రీయ పద్ధతిలో అంచనా వేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రణాళిక అధికారి రమ్య, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్