Magazines

మలిదశ ఉద్యమకారుల హామీలు అమలుచేయాలి

1 గంట క్రితం

implemented
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-ఆలేరు టౌన్  

తెలంగాణ మలిదశ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని, జాప్యానికి తావివ్వకుండా, కేకే కమిటీ దిశ నిర్దేశం చేయాలని, తెలంగాణ మలిదశ ఉద్యమకారుల కమిటీ సభ్యులు, పసుపునుర్ వీరేశం ఆలేరు పట్టణంలో శనివారం ప్రభుత్వాన్ని  ఒక ప్రకటనలో కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు 14 సంవత్సరాల అవుతున్న ఇంతవరకు  మలిదశ ఉద్యమకారులకు ఎలాంటి న్యాయం జరగలేదని, ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నాయని ఆరోపించారు. 


గతంలో కేసీఆర్ ప్రభుత్వం పది సంవత్సరాలు అధికారంలో ఉండి, తెలంగాణ మలిదశ ఉద్యమకారులకు న్యాయం చేయకపోవడం షోచనీయము అని తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో తెలంగాణ ఉద్యమకారుల 250 యార్డ్స్ ఇంటి స్థలం, పెన్షన్ ఇస్తామని, మేనిఫెస్టోలో ప్రకటించిన సంగతి గుర్తు చేశారు .  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు పూర్తయినప్పటికీ, హామీని నెరవేర్చకపోవడం ఉద్యమకారులకు అవమానకరమన్నారు.


ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కేకే కమిటీని ఏర్పాటు చేసి తెలంగాణ మలిదశ ఉద్యమకారుల అభిప్రాయాలను సేకరించినప్పటికీ, ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని  పేర్కొన్నారు.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి తెలంగాణ మలిదశ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రతి ఉద్యమకారుడు 250 యార్డ్స్ ఇంటి స్థలం 25000 పెన్షన్ ప్రకటించాలని ప్రకటనలో తెలంగాణ మలిదశ ఉద్యమకారుల తరపున కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్