Magazines

సోమేశ్వరాలయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రత్యేక పూజలు

57 నిమిషాల క్రితం

Supreme Court judge
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 02, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-ఆలేరు రూరల్‌ 

ఆలేరు మండలం కొలనుపాకలోని శ్రీ చండికాంబ సహిత సోమేశ్వరస్వామి ఆలయాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌. మహదేవన్‌ శుక్రవారం సందర్శించారు.ఆయన దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.ఆలయ అర్చకులు జీఎం సోమయ్య,గంగాధర్‌ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ అధికారులు, అర్చకులు న్యాయమూర్తి దంపతులను ఘనంగా సత్కరించారు. ఆలయ చారిత్రక, ఆధ్యాత్మిక విశిష్టతను పండితులు వారికి వివరించారు. కార్యక్రమంలో జిల్లా, స్థానిక న్యాయమూర్తులు, బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదులు,ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్